జాతీయ వార్తలు

ఈ విజయ దశమి దేశానికి ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మనం త్వరలో జరుపుకోనున్న విజయదశమికి చాలా ప్రత్యేక ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో గల ఉగ్రవాద స్థావరాలపై ఇటీవల భారత సైన్యం విజయవంతంగా లక్షిత దాడులను నిర్వహించిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రానున్న రోజుల్లో మనం విజయదశమిని జరుపుకోనున్నాం. దేశానికి ఈ సంవత్సరం విజయదశమి చాలా ప్రత్యేకమైనది’ అని ఆయన ఆదివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రేక్షకులు ఒక్కసారిగా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. జన సంఘ్ మాజీ అధినేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం, బోధనలకు సంబంధించిన 15 పుస్తకాల నుంచి సేకరించిన సంక్షిప్త సంకలనాన్ని ప్రధాని ఈ సందర్భంగా విడుదల చేశారు. బిజెపి ఈ సంవత్సరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సంకలనం వెలువడింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన అతిపెద్ద సేవ రాజకీయ పార్టీ అంటే కొద్ది మంది నడిపే సంస్థగా కాకుండా వ్యవస్థీకృతమైన సంస్థగా ఉండాలని చెప్పిన భావన అని ఆయన అన్నారు. పటిష్ఠమైన జాతికి ముందుగా కావలసింది అసామాన్యమైన సైనిక వ్యవస్థ అన్న ఉపాధ్యాయ వ్యాఖ్యలను ప్రధాని ఈ సందర్భంగా ఉటంకించారు. నేటి అవసరాలకు తగిన శక్తిసామర్థ్యాలను దేశం తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ‘సాయుధ బలగాలు చాలా చాలా సామర్థ్యం కలిగి ఉండాలని, అప్పుడే దేశం పటిష్ఠంగా ఉంటుందని ఆయన (ఉపాధ్యాయ) చెబుతుండేవారు’ అని మోదీ పేర్కొన్నారు. ‘పోటీతో కూడిన ఈ కాలంలో దేశం సమర్థవంతగా, పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. ‘పటిష్ఠంగా ఉండటం అంటే మరొకరికి వ్యతిరేకంగా ఉండటం కాదు. మన బలం కోసం మనం వ్యాయామం చేస్తే, పొరుగువారు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నామని కలత చెందాల్సిన అవసరం లేదు. నన్ను నేను దారుఢ్యంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేను వ్యాయామం చేస్తున్నాను’ అని ప్రధాని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషిని రాంమనోహర్ లోహియా కూడా ప్రస్తావించారని, ఉపాధ్యాయ కృషి వల్లనే 1967లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయకు నివాళిగా తమ ప్రభుత్వం పేదల్లోకెల్లా పేదలను దృష్టిలో పెట్టుకొని పథకాలను రూపొందించి అమలు చేస్తోందని అన్నారు. ఉపాధ్యాయ వేసిన పునాది వల్లనే స్వల్ప కాలంలో ఒక పార్టీ ‘ప్రతిపక్షం’ నుంచి ‘అధికార పక్షా’నికి తన యాత్రను ముగించిందని ప్రధాని అన్నారు.
స్వచ్ఛ ఇంధనం దిశగా భారత్
భారత్ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణానికి హాని కలుగనటువంటి స్వచ్ఛమైన వనరులతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను ప్రపంచ దేశాలు అందజేయవలసి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. అయితే అవసరమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానం లభించే దాకా దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ‘ప్రత్యామ్నాయ’ పద్ధతుల గురించి తాను ఆలోచిస్తానని ఆయన అమెరికాకు చెందిన టివి షో అతిథి డేవిడ్ లెటర్‌మాన్ ఒక డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇయర్స్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ’ అనే ఈ డాక్యుమెంటరీ ఆదివారం ప్రసారమయింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం సమష్టి బాధ్యత అని మోదీ అన్నారు. ఈనాటి ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా ఉండజాలదని, మొత్తం ప్రపంచమంతా పరస్పర ఆధారితమని ప్రధాని పేర్కొన్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జనసంఘ్ మాజీ అధినేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి