జాతీయ వార్తలు

మాటేసిన మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 10: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు మట్టుబెట్టిన నేపథ్యంలో సోమవారం ముగ్గురు తీవ్రవాదులు శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డ సంఘటన కలకలం రేపింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బలగాలను రంగంలోకి దింపారు. గంటల తరబడి జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం తెల్లవారు జామున ముగ్గురు మిలిటెంట్లు ఇడిఐ అనే ప్రభుత్వ భవనంలోకి చొరబడ్డారని, తన ఉనికిని చాటుకుంటూ కవ్వింపు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.సమీపంలోని కాలువను ఆసరా చేసుకునే ఉగ్రవాదులు ఈ భవనంలోకి ప్రవేశించి ఉంటారని చెబుతున్నారు. ఆ ప్రాంతాన్నంతా మూసేసిన బలగాలు మిలిటెంట్లను బయటికి రప్పించడానికి లేదా ఆ భవనంలోనే వారిని మట్టుబెట్టడానికి తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపినా రాత్రి పొద్దుపోయే వరకూ ఎలాంటి ఫలితం కనిపించలేదు. భవనంలోని మిలిటెంట్లు చీకట్లో ఎక్కడికీ పారిపోవడానికి వీల్లేకుండా పరిసర ప్రాంతాల్లోనూ నిఘాను ముమ్మరం చేశారు.కాశ్మీరీ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ భవనాన్ని ఉపయోగిస్తారని, ప్రస్తుతం సెలవులు కావడం వల్ల మిలిటెంట్లకు ఎవరూ బందీలుగా చిక్కలేదని అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో కూడా ఇదే భవనాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు జరిపిన దాడిలో ఐదుగురు మరణించిన విషయాన్ని గుర్తు చేసిన అధికారులు ఉగ్రవాదులు పారిపోవడానికి వీల్లేకుండా అన్ని మార్గాలనూ మూసేశామని వెల్లడించారు. కాశ్మీర్ నుంచి పాకిస్తాన్‌కు ప్రవహించే జీలం నది గుండానే మిలిటెంట్లు ఇక్కడికి చేరుకుని ఉంటారని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం వరకూ కూడా ఈ ఎదురుకాల్పులు కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
భారత్‌పై ప్రతీకార దాడులు జరిపేందుకు కాశ్మీర్‌లోయ ప్రాంతంలో దాదాపు 250మంది పాక్ మిలిటెంట్లు సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్ వంటి మిలిటెంట్ సంస్థలకు చెందిన ఈ ఉగ్రవాదులు దాడులకు అదనుకోసం ఎదురుచూస్తున్నట్టుగా స్పష్టం చేశాయి. తాజాగా కాశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ భవనంలోకి మిలిటెంట్లు చొరబడటాన్ని కూడా ప్రతీకార దాడుల్లో భాగంగానే చెబుతున్నారు.
దసరా, దుర్గా పూజ, మొహర్రం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్లు,రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, ప్రార్థనా స్థలాలు సహా జన సమ్మర్ధంగా ఉండే అన్ని చోట్లా అదనపు బలగాలను మోహరించాలని స్పష్టం చేసింది. దేశంలో కల్లోల పరిస్థితుల్ని సృష్టించడమే లక్ష్యంగా పాక్ మిలిటెంట్లు ఏ క్షణంలోనైనా దాడులకు దిగే అవకాశం ఉందని..వీటికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అంతటా గస్తీ, నిఘాను పటిష్టం చేయాలని తెలిపింది.

చిత్రం... హోరాహోరీ కాల్పుల్లో దగ్ధమవుతున్న ఉగ్రవాదులు నక్కిన భవనం