జాతీయ వార్తలు

వ్యవసాయానికి హాని చేస్తున్న టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: వ్యవసాయం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంపై రూపొందించే చట్టాలు భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయాభివృద్ధిని దెబ్బ తీయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు పంట దిగుబడిని పెంచే సాంకేతిక పరిజ్ఞానాలు నిలకడయిన అభివృద్ధిని కుంటుపడనీయకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యవసాయ-జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సులో మోదీ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ఫలితంగా మొక్కలు, జంతు జాతులు అంతరించే ప్రమాదం ఎదురవుతోందని, అందువల్ల వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి జరిపే పరిశోధనలు, జన్యువనరులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా వీటిని పరిరక్షించడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆకలి, పోషకాహార లోపం, పేదరికంపై పోరాటం చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి శాస్త్ర, సాంకేతికతలు ఎంతయినా అవసరం. అయితే ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సమయంలో నిలకడయిన అభివృద్ధి, జీవ వైవిధ్యం అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు’ అని 60 దేశాలకు చెందిన దాదాపు 900 మంది ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ మోదీ అన్నారు.
వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించడం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయాల్సిన అవసరం ఉందని అంటూ, క్రిమి సంహారక మందులను ఉపయోగించడం వల్ల ఫలదీకరణ ప్రక్రియలో తేనెటీగలపై ప్రభావం చూపించడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. జనంపై టెక్నాలజీ ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందంటే మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్లు తమ సొంత ఫోన్ నంబర్లు సైతం గుర్తు పెట్టుకోలేకపోతున్నారని ఆయన నవ్వుతూ అన్నారు. అందువల్ల వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎలాంటి మార్పులు వస్తున్నాయనే దానిపైన కూడా మనం దృష్టిపెట్టాలన్నారు. వ్యవసాయ రంగానికి క్రిమిసంహారకాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన అంటూ, క్రిమి సంహారక మందులు కేవలం చీడపురుగలనే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు అవసరమైన క్రిమి కీటకాదులను సైతం హతమారుస్తున్నాయన్నారు. జన్యు సంపద అంతరించి పోవడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తూ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి జాతీయ, అంతర్జాతీయ, ప్రైవేటు సంస్థలు, నిపుణులు కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కోరారు. ‘1992 నాటి జీవ వైవిధ్య పరిరక్షణ సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ ప్రతి రోజూ 50నుంచి 150 దాకా జాతులు అంతరించిపోతున్నాయి. రాబోయే రోజు ల్లో ప్రతి ఎనిమిది పక్షుల్లో ఒకటి, ప్రతి నాలుగు జంతువుల్లో ఒకటి అంతరించి పోయే ప్రమాదం ఉంది. అందువల్ల మన ఆలోచనలను మార్చుకోవలసిన అవసరం ఉంది’ అని ప్రధాని అన్నారు. ప్రకృతి అసమతుల్యత కారణంగానే వాతావరణ మార్పుల సమస్య తెలెత్తిందని అంటూ, అందుకే దీనికి సంబంధించిన పారిస్ ఒప్పందానికి భారత దేశం అక్టోబర్ 2న ఆమోదముద్ర వేసిందన్నారు.
జీవ వైవిధ్యం పరిరక్షణ ప్రతి దేశానికీ ముఖ్యమేనని ప్రధాని స్పష్టం చేస్తూ జన్యుపరమైన వనరులను జన్యు బ్యాంకుల్లో పరిరక్షించి వాటిని రైతులకు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. హరిత విప్లవం, క్షీర విప్లవంతో పాటుగా నీలి విప్లవం కూడా రావాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేస్తూ, శాస్తజ్ఞ్రులు కేవలం
న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సదస్సులో
ఎం.ఎస్ స్వామినాథన్‌కు మెమొంటోను అందజేస్తున్న ప్రధాని మోదీ చేపల పెంపకంపైనే కాకుండా సముద్ర నాచు సాగుపైన కూడా దృష్టిపెట్టాలన్నారు.