జాతీయ వార్తలు

జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 31 జిల్లాలలో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశా వ్యాప్తంగా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రుల సమావేశానికి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. మంత్రి హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోని 31 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు.
దీనికి సంబంధించి కేంద్రమంత్రి రాధా మోహన్ అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకుంటున్న తీరును కేంద్రమంత్రికి వివరించామని, రైతులకు మద్దతు ఇచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పప్పు దినుసులు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున వాటికి కనీస మద్దతు ధర కల్పించాలని కోరమన్నారు. అలాగే తెలంగాణలో గోదాముల నిర్మాణానికి రూ.400 కోట్లు సబ్సిడిని ఆర్.కె.వై.ఎస్ కింద ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. దేశ వ్వాప్తంగా ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకంలో భాగంగా 99 నీటి ప్రాజెక్టులకు విడుదల అవుతున్న నిధులు ఇతర అంశాల పురోగతిపై సమీక్ష సమావేశం జరిగిందని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఏ రాష్ట్రాలైతే త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాయో... అలాగే అదనపు ఆయకట్టుకు నీటిని ఇస్తాయో ఆ రాష్ట్రాలకు ఎక్కవ ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. అలాగే నాబార్డు నుంచి రాష్ట్రాలకు ఇచ్చే రుణం విషయంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు రాకుండా ఎప్.ఆర్.బి.ఎం పరిమితిని తొలగించాలని కేంద్రానికి చెప్పినట్టు వెల్లడించారు.

ఢిల్లీలో గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ నేతృత్వంలో నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు

అభివృద్ధికి
సహకరించండి

కేంద్ర మంత్రులకు టిఆర్‌ఎస్ ఎంపీల వినతి
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు పలువురు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎంపీ జితేందర్ రెడ్డి అధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పి.దయాకర్, బూర నర్సయ్యగౌడ్, సీతారాం నాయక్, జి.నగేష్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్రమంత్రులు జె.పి.నడ్డా, ప్రకాశ్ జవదేకర్, రాధామోహన్ సింగ్, స్మృతి ఇరానీలను ఎంపీల బృందం కలిసింది. కేంద్రమంత్రి జె.పి నడ్డాను కలిసి మెటర్నటి, వైద్య శాఖ వసతులకు రూ.483 కోట్లు కేటాయించాలని కోరినట్లు ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. ప్రకాశ్ జవదేకర్‌ని కలసి కేంద్రీయ, నవోదయ, సర్వశిక్ష అభియాన్ శాఖలకు వౌలిక సదుపాయలు, వసతులు కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తం గా కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్‌కి విజ్ఞప్తి చేశామని జీతేందర్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి కోనుకోలు కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళి శాఖమంత్రి స్మృతి ఇరానీని కోరామన్నారు. గతంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి పంపిన లేఖలను కేంద్రమంత్రులకు అందచేసినట్లు జితేందర్ రెడ్డి వెల్లడించారు.