జాతీయ వార్తలు

పన్ను ఎగ్గొట్టిన డిపాజిట్లు 4 లక్షల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

80 వేల కోట్ల రుణాలు చెల్లించేశారు
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
ఐటి శాఖ పరిశీలనలో తేలిన లెక్కలు
నోటీసుల జారీ యోచనలో అధికారులు

న్యూఢిల్లీ, జనవరి 10: 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్లపై ఆదాయం పన్ను శాఖ దృష్టి పెట్టింది. రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలను ఆ శాఖ సమగ్రంగా విశే్లషిస్తోంది. ‘బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తంలో మూడునుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల దాకా పన్ను ఎగవేసిన ధనం ఉండవచ్చని ఐటి శాఖ అంచనా వేసింది. ఈ మొత్తాలను డిపాజిట్ చేసిన వారి వివరాలు సేకరించి నోటీసులు పంపించాలని ప్రభుత్వం ఐటి శాఖను ఆదేశించింది’ అని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నోట్ల రద్దు తర్వాత దాదాపు 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మించి డిపాజిట్ అయ్యాయి. వీటి వివరాలన్నిటినీ నిశితంగా విశే్లషించగా ఈ 60 లక్షల ఖాతాల్లో రూ.7.34 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు తేలింది. వీటిలో మొత్తం రూ.42 వేల కోట్లకు సంబంధించిన డిపాజిట్లకు ఒకే పాన్, ఫోన్ నంబరు లేదా చిరునామా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో ఏకంగా రూ. 10,700 కోట్ల అనుమానిత డిపాజిట్లు నమోదయినట్లు గుర్తించారు. సహకార బ్యాంకుల్లోని వివిధ ఖాతాల్లో డిపాజిట్ అయిన 16వేల కోట్ల సొమ్ముపైనా ఐటి, ఇడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ. 13వేల కోట్లకు పైబడిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత దాదాపు రూ.80 వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించడం జరిగిందని ఐటి అధికారులు గుర్తించారు. ఇక నిష్క్రియాత్మకంగా ఉండే బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ.25 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు కూడా గుర్తించినట్లు ఆ అధికారి తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన వ్యక్తులు డిపాజిట్ చేసిన వేర్వేరు పరిమితుల నగదు డిపాజిట్లకు సంబంధించి బ్యాంకులనుంచి నివేదికలు కోరడం జరిగిందని, ప్రభుత్వ డేటా బేస్‌ల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ నివేదికలను విశే్లషించడం జరుగుతోందని తెలిపారు.