హైదరాబాద్

సంక్షేమ పథకాలు భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: పేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, పేదలకూ కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా అమలవుతున్న ఆరోగ్య శ్రీ, వయోవృద్దులకు ఆర్థిక చేయూతనిస్తున్న ఆసరా వంటి సంక్షేమ పథకాల అమలు తీరు భేష్! అంటూ సర్కారుకు కితాబునిచ్చింది బంగ్లాదేశ్ ఉన్నతాధికారుల బృందం. అంతేగాక, తమ దేశంలో ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తాయమని కూడా వెల్లడించింది. 31 మంది డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారుల బృందం ప్రజాపరిపాలన వ్యవస్థపై పదిరోజుల పాటు శిక్షణ పొందేందుకు నగరంలోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీకి విచ్చేసింది. ఇందులో భాగంగా ఆ బృందం బుధవారం కలెక్టర్ రాహుల్‌బొజ్జాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రశంసించింది. కలెక్టర్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు అభివృద్ధి, పరిపాలన తీరుతో పాటు సంక్షేమ పథకాల గురించి బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీ వర్గాల్లోని పేద ప్రజలకు వివాహం సమస్య కాకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలను అందించే పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు, ఇళ్లు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు గల విస్రృత అధికారాలను వివరిస్తూ ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు శాఖ కూడా కలెక్టర్ నియంత్రణలోనే పనిచేస్తుందని వివరించారు. కానీ హైదరాబాద్ జిల్లా పరిఋధిలో మాత్రం పోలీసు కమిషనర్ నియంత్రణలో పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోని భూములు అత్యంత విలువైనవని, అందువల్ల జిల్లా కలెక్టర్‌గా తాను అధిక సమయం అట్టి భూముల పరిరక్షణకే వెచ్చిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ శాఖను ఈ ఆఫీసుగా మార్చేందుకు తాము తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ బృందానికి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలచే ఎన్నుకొబడిన జిల్లా పరిషత్ వ్యవస్థ పనిచేస్తుందని, ఆ వ్యవస్థకు అధికారిగా ఉండే సిఇవో, గ్రామపంచాయతీ, జడ్పీ స్థాయిలో పలు కార్యక్రమాలను అమలు పరుస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కలెక్టర్లకు జ్యూడీషియల్ అధికారాలు ఉంటాయని ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ బదులిస్తూ సాధారణంగా మెజిస్టేరియల్ అధికారులే తమకుంటాయని తెలిపారు. ఈ బృందంలో సీరియర్ అసిస్టెంటు సెక్రటరీ అల్లావుద్దిన్ అలీ, డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ జయిదుల్ ఇస్లామ్, సిస్టబ్ అనలిస్టు మహ్మద్ అస్లామ్, మహ్మద్ మసూద్ ఆలం తదితరులు పాల్గొన్నారు.