జాతీయ వార్తలు

నిధులిచ్చి ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 18: రాష్ట్ర మంత్రి కెటిఆర్ శుక్రవారం ఢిల్లీలో సుడిగాలి పర్యటన జరిపారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయ్యారు. రెండో దశ టి హబ్‌కోసం 100 కోట్లు ఇవ్వాలని, ఐటిఐఆర్‌లో భాగంగా వౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణకు రావలసిన 3000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరారు. ఐటీఐఆర్‌లో మార్పులు చేర్పులు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ కెటిఆర్‌కు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్‌కి మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తోందని, అందులో భాగంగా డిజైనింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన 50 కోట్ల రూపాయలను కేటాయించాలని రవిశంకర్ ప్రసాద్‌కు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే రెండో దశ టి హబ్ ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆయన ఆహ్వానించారు. కాగా కరీంనగర్‌కు స్మార్ట్‌సిటి జాబితాలో స్థానం కల్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యతో భేటీ అయిన సందర్భంగా కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి తాగునీటి కల్పన, మిషన్ భగీరథ, రాష్ట్ర పథకాలకు సహాయం అందించాలని కూడా కోరారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కెటిఆర్ సమావేశం అయ్యారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై ఆయన చర్చించారు. చివరగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ఎఫ్‌ఆర్‌బిఎమ్ అంశాలపై చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డుసంబంధించిన ప్రాజెక్టుకు జైకా నుంచి తీసుకున్న రుణానికి ఈ నెలాఖరుకు గడువు పూర్తవుతున్నదున రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చేసిన 833 కోట్ల రూపాయలు ఉపయోగించుకోనేలా అనుమతి ఇవ్వాలని కూడా ఆయన జైట్లీని కోరారు. చివరగా తన ఢిల్లీ పర్యటన వివరాలను కెటిఆర్ విలేఖరులకు వివరించారు. పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చాలన్న ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కెటిఆర్ స్పందిస్తూ ప్రజాల దృష్టిని మరల్చడానికే ఏపీ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్ర సోదరులు గంపగుత్తగా టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేశారు. ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను కెటిఆర్ స్కాచ్ ఛాలెంజర్ అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన 43వ స్కాచ్ సమ్మిట్ లో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన శుక్రవారం అందుకున్నారు.

చిత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన ఐటి మంత్రి కెటిఆర్