హైదరాబాద్

నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మహిళలు, చిన్నపిల్లల ఆసుపత్రి నిలోఫర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా బుధవారం సందర్శించారు. ఇటీవల ఆసుపత్రిలో వరుసగా అయిదుగురు బాలింతలు మృతి చెందిన ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తామన్న సర్కారు ప్రకటన మేరకు కలెక్టర్ రాహుల్ బొజ్జాను ప్రభుత్వం ఇటీవలే విచారణాధికారిగా నియమించింది. దీంతో ఆయన బుధవారం ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్, వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బాలింతల మృతి ఘటనకు సంబంధించి పూర్వాపరాలు అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బాలింతల మరణానికి గల కారణాలను తేల్చేందుకు ఇప్పటికే వైద్యులతో త్రిసభ్య కమిటీని నియమించటం జరిగిందని వివరించారు. ఈ కమిటీ మృతి చెందిన బాలింతలకు ఎక్కించిన రక్తం, మందులు, మైక్రోబయాలజీ తదితర అంశాలకు సంబంధించిన రిపోర్టులను సేకరిస్తుందని, వాటికి సమగ్ర నివేదికలు అందిన తర్వాత తదుపరి కార్యాచరణను వెల్లడించనున్నట్లు విచారణాధికారి అయన కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సురేశ్‌కుమార్, పిడియాట్రిషన్ డా.రవి, డా.ప్రతిభ, ప్రొ.రాణి తదితరులు పాల్గొన్నారు.