జాతీయ వార్తలు

కోట్లు కొల్లగొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.2900 కోట్లు దారి మళ్లించిన 339 డొల్ల కంపెనీలు

గుట్టు రట్టు చేసిన సిబిఐ

న్యూఢిల్లీ, మే 7: దాదాపు 2,900 కోట్ల రూపాయల నిధులను అక్రమంగా దారి మళ్లించడానికి ఉపయోగించిన 339 డొల్ల కంపెనీల గుట్టును సిబిఐ రట్టు చేసింది. గత మూడేళ్లుగా ఇలాంటి కంపెనీలపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సిబిఐ ఈ డొల్ల కంపెనీల గుట్టును రట్టు చేసింది. పన్నులు ఎగవేసేందుకు, అలాగే నల్లధనాన్ని పోగు చేసుకునేందుకు గాను ప్రత్యేక అవసరాల కోసం తీసుకున్న రుణాల నిధులను తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించి, బూటకపు దిగుమతుల కోసం చెల్లింపుల ముసుగులో నిధులను విదేశాల్లోని పన్ను స్వర్గ్ధామాలకు పంపించి తిరిగి విదేశీ పెట్టుబడులుగా చూపిస్తూ ఆ నిధులను వెనక్కి తీసుకు రావడం కోసం ఈ డొల్ల కంపెనీలను అనుమానితులు ఉపయోగించుకుంటున్నట్లు సిబిఐ గుర్తించింది. అయితే సిబిఐ కనుగొన్న విషయం ‘సముద్రంలో కాకిరెట్ట’తో సమానమని, ఎందుకంటే బ్యాంకులను మోసం చేసేందుకు నిధులను దారి మళ్లించడం లాంటి నేరాలకు సంబంధించిన విచారణలో భాగంగా చట్టపరంగా నిలిచే సాక్ష్యాధారాలను కనుగొన్న కేసులు మాత్రమే ఇవని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 28 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక ప్రైవేటు బ్యాంకులో జరిగిన రుణాల కుంభకోణాలపై సిబిఐ జరిపిన దర్యాప్తులో ఈ మోసాలు వెలుగు చూశాయి.
ఇది కాక కనీసం 30 వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన దాదాపు 200 బ్యాంకు మోసాల కేసులను కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
తానుగా దర్యాప్తు జరపడంతో పాటుగా కంపెనీల చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, బినామీ లావాదేవీల నిరోధక చట్టం, ఆదాయం పన్ను చట్టం తదితర చట్టాల కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ కేసులను సిబిఐ ఇతర దర్యాప్తు ఏజన్సీలకు కూడా నివేదించనుంది. సిబిఐ ఈ డొల్ల కంపెనీల బండారాన్ని బైట పెట్టడంతో పాటుగా ఇకపై ఎలాంటి లావాదేవీలకు వీటిని ఉపయోగించకుండా చూడడానికి అవసరమైన బలమైన ఆధారాలను కూడా అది సంపాదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.