జాతీయ వార్తలు

రెండు కోట్లు తీసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేజ్రీవాల్‌కు జైన్ ఇచ్చారు
నేనే ప్రత్యక్ష సాక్షిని
మాజీ మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణ
ఢిల్లీ కేబినెట్‌లో నీతిమంతుణ్ణి తానేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 7: దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి.. ఆ ఉద్యమాన్ని ఎన్నికల రాజకీయంగా మలచి అనతి కాలంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఊహించని ఆరోపణ ఎదుర్కొన్నారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ స్వయంగా కేజ్రీవాల్‌కు రెండు కోట్ల రూపాయలు ఇవ్వటం తాను ప్రత్యక్షంగా చూశానని ఢిల్లీ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆదివారం తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీ రాష్ట్ర మంత్రి మండలి నుంచి శనివారం రాత్రి ఉద్వాసనకు గురయిన కపిల్ మిశ్రా ఆదివారం ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తన నివాసంలో క్యాబినెట్ మంత్రి సత్యేందర్ జైన్‌నుంచి రూ. రెండు కోట్లు తీసుకుంటుండగా తాను స్వయంగా చూశానని మిశ్రా ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఆప్ నాయకత్వంతో అంతర్గతంగా ఘర్షణ పడుతున్న సీనియర్ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు మద్దతుగా నిలిచిన కొన్ని రోజులకే మిశ్రా మంత్రిపదవి ఊడిపోయింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఈ రెండేళ్ల కాలంలో తాను చూసిన వివిధ రకాల అవకతవకల గురించి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు తెలియజేశానని మిశ్రా చెప్పారు. ‘కేజ్రీవాల్‌కు సత్యేందర్ జైన్ రూ. రెండు కోట్ల నగదు ఇస్తుండగా నేను కళ్లారా చూశాను. దీని గురించి నేను కేజ్రీవాల్‌ను అడగ్గా, రాజకీయాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, దీని గురించి తరువాత వెల్లడిస్తానని ఆయన బదులిచ్చారు’ అని మిశ్రా ఆదివారం ఇక్కడ రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం విలేఖరులకు చెప్పారు. కేజ్రీవాల్ బంధువులకు చెందిన రూ. 50 కోట్ల విలువ గల భూలావాదేవీని తాను పరిష్కరించానని మంత్రి సత్యేందర్ జైన్ స్వయంగా తనకు చెప్పారని కూడా మిశ్రా పేర్కొన్నారు. దీని గురించి తాను కేజ్రీవాల్‌ను అడగ్గా, అదంతా అబద్ధమని, తనపై విశ్వాసం ఉంచాలని ఆయన అన్నారని చెప్పారు. తాను ఆప్‌లోనే కొనసాగుతానని, తనను ఎవరూ పార్టీనుంచి బయటకు పంపలేరని అన్నారు. పార్టీలో అవినీతిని తుడిచివేస్తానని ఆయన పేర్కొన్నారు. అవినీతి అంశాలపై పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చినందువల్లనే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని మిశ్రా ఆరోపించారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తోసిపుచ్చారు. మిశ్రా చేసిన ఆరోపణలు స్పందించాల్సినంత అర్హమైనవి కావని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, సత్యదూరమైనవని సిసోడియా ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. సమర్థవంతంగా పని చేయనందు వల్లనే మిశ్రాను మంత్రి మండలి నుంచి తొలగించడం జరిగిందని ఆయన చెప్పారు. మనీష్ చెప్పిందే నిజమైతే రెండేళ్ల పాటు ఎందుకు ఆగారని మిశ్రా ప్రశ్నించారు. తాను నీటి సరఫరా మంత్రిగా ఉన్నానని, ఇంతకాలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తరచూ ఢిల్లీ నగరంలో మంచినీటి సరఫరా మెరుగైందని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారని, ఇప్పుడు తన సమర్థతను ఏ రకంగా ప్రశ్నిస్తారన్నారు? ‘కేజ్రీవాల్‌ను ఎవరూ అవినీతి పరుణ్ణి చేయలేరు అని ఇన్నాళ్లూ భావించే వాణ్ని. కానీ కొన్ని కేసులు నేను స్వయంగా చేశాను. మనీ లాండరింగ్, నల్లధనం, ఓ మంత్రి(జైన్) కూతురుకు ఉద్యోగం ఇవ్వటం, లగ్జరీ బస్ స్కీం, సిఎన్‌జి ఫిట్‌నెస్ టెస్ట్ స్కాం ఇలా ఎన్నో అంశాల్లో అవకతవకలు, అక్రమాలు తాను కళ్లారా చూశానన్నారు. కేజ్రీవాల్ మంత్రి మండలిలో తానొక్కడినే లంచగొండిని కానని కూడా స్పష్టం చేశారు. తన దగ్గర ఉన్న వివరాలు సిబి ఐకి, ఏసిబికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు
వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు