క్రీడాభూమి

పుణె జట్టుకు ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వచ్చే రెండేళ్ల కోసం తాత్కాలిక ప్రాతిపదికన అడుగుపెట్టిన పుణె, రాజ్‌కోట్ జట్లు తొలి ఆటగాళ్ల కొనుగోళ్లను పూర్తి చేశాయి. మంగళవారం డ్రాఫ్ట్ విధానంలో జరిగిన వేలంలో భారత పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీని సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. దీనితో అతను పుణె జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరిస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అదే విధంగా ఇంటెక్స్ మొబైల్స్ కొనుగోలు చేసిన రాజ్‌కోట్ జట్టు మొదటి ప్రాధాన్యతను సురేష్ రైనాకు ఇచ్చింది. ‘రివర్స్ బిడ్డింగ్’ పద్ధతిలో, తక్కువ మొత్తాన్ని బిడ్ చేసిన పుణె జట్టుకు తొలి ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. ముందుగా ఊహించిన విధంగానే ఆ జట్టు ధోనీవైపు మొగ్గు చూపింది. అనంతరం రాజ్‌కోట్ తనకు లభించిన అవకాశాన్ని రైనాను కొనేందుకు వినియోగించింది. ఈ డ్రాఫ్ట్ విధానంలో మొదటి ప్రాధాన్యత కింద వేలంలో అమ్ముడైన ఆటగాళ్లకు చెరి 12.5 కోట్ల రూపాయలు లభిస్తాయి.
రెండో అవకాశంలో పుణె జట్టు ఆజింక్య రహానేను కొనుగోలు చేయగా, రాజ్‌కోట్ స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజాను ఎంపిక చేసుకుంది. వాస్తవానికి ఈ జట్టు మొదటి ప్రాధాన్యత కింద జడేజాను తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న జడేజా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అశ్విన్‌తోపాటు అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. దీనితో రాజ్‌కోట్ అతనికే మొదటి ప్రాధాన్యతనిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రైనాను ఎంపిక చేసిన ఆ జట్టు ద్వితీయ ప్రాధాన్యతను జడేజాకు ఇచ్చింది. కాగా, ద్వితీయ ప్రాధాన్యం కింద వేలంలో అమ్ముడైన జడేజా, రహానేలకు చెరి 9.5 కోట్ల రూపాయలు దక్కుతాయి.
మూడో చాయిస్ కింద రవిచంద్రన్ అశ్విన్‌ను పుణె జట్టు కొనుక్కున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న అతను మొదటి ప్రాధాన్యతగా ధోనీకి గట్టిపోటీనిస్తాడని విశే్లషకులు అంచనా వేశారు. కానీ, అశ్విన్ పేరు కేవలం మూడో ప్రాధాన్యత కింద వేలంలో పాటకు వచ్చింది. పుణె జట్టు అశ్విన్‌ను కొనుగోలు చేయగా, న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌ను రాజ్‌కోట్ దక్కించుకుంది. మూడో ప్రాధాన్యత కింద వీరికి చెరి 7.5 కోట్ల రూపాయలు లభిస్తాయి.
నాలుగో ప్రాధాన్యంలో ఇరు జట్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లనే ఎంపిక చేసుకోవడం విశేషం. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను పుణె, జేమ్స్ ఫాల్క్‌నర్‌ను రాజ్‌కోట్ ఫ్రాంచైజీలు కొన్నాయి. వేలంలో నాలుగో స్థానం కావడంతో వీరికి చెరి 5.5 కోట్ల రూపాయలను చెల్లిస్తారు.
ఐదవ, చివరి ఆటగాడిగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫఫ్ డు ప్లెసిస్‌ను పుణె, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వెయిన్ బ్రేవోను రాజ్‌కోట్ తీసుకున్నాయి. వీరికి చెరి 4 కోట్ల రూపాయలు లభిస్తాయి.

పుణె కొనుగోలు చేసిన
క్రికెటర్లు:
మహేంద్ర సింగ్ ధోనీ (రూ. 12.5 కోట్లు), ఆజింక్య రహానే (రూ. 9.5 కోట్లు), రవిచంద్ర అశ్విన్ (రూ. 7.5 కోట్లు), స్టీవెన్ స్మిత్ (రూ. 5.5 కోట్లు), ఫఫ్ డు ప్లెసిస్ (రూ. 4 కోట్లు).
రాజ్‌కోట్ వేలంలో
కొన్న క్రికెటర్లు:
సురేష్ రైనా (రూ. 12.5 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 9.5 కోట్లు), బ్రెండన్ మెక్‌కలమ్ (రూ. 7.5 కోట్లు), జేమ్స్ ఫాల్క్‌నర్ (రూ. 5.5 కోట్లు), డ్వెయిన్ బ్రేవో (రూ. 4 కోట్లు).