జాతీయ వార్తలు

విశ్రాంత ఉద్యోగుల పొదుపుపై పన్ను వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: నాన్ పర్‌ఫార్మింగ్ ఆస్తుల సంఖ్య పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. జితేందర్ రెడ్డి గురువారం లోక్‌సభలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ బ్యాంకులకు ఆర్‌బిఐ రక్షణ కల్పించటం ముదావహమన్నారు. బ్యాంకు అధికారులు రాజకీయ వత్తిళ్ల మూలంగా పలు సందర్భాల్లో రుణాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని, అయితే ఇప్పుడీ సవరణ మూలంగా వారు ధైర్యంగా తమ విధులను నిర్వహించగలుగుతారని జితేందర్ రెడ్డి ప్రశంసించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పొదుపు నిధులపై పన్ను విధించకూడదని కేంద్ర మంత్రికి విజప్తి చేశారు.