హైదరాబాద్

ఒక నెలలో రెండు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ మహా నగర రూపురేఖలు మార్చనున్నాయి. ఇదే నెలలో రెండు అరుదైన ప్రాజెక్టుల్లో ఒకటి ప్రజలకు అందుబాటులోకి వస్తుండగా, మరోకటి క్షేత్ర స్థాయిలో పనులను ప్రారంభించుకోనుంది. హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలులోని కారిడార్ 1,3ల్లో ఇరవై కిలోమీటర్ల పొడువున ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే సర్కారు కసరత్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను అమలు చేసినా, ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టినా పరిష్కారం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టేందుకు గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రాజెక్టులోని రెండు కారిడార్లలో ఇరవై కిలోమీటర్ల వరకు మెట్రోను అందుబాటులోకి తేవటంతో పాటు నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా సర్కారు రూపకల్పన చేసిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి)ను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్లాన్ కింద తొలి దశగా రూ. 5319 కోట్లతో చేపట్టనున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్, స్కైవేలు, గ్రేడ్ సెపరేటర్లు వంటి వాటి నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే! లీ అసోసియేట్ అనే సంస్థకు ఈ పనులను అప్పగించటంతో ఆ సంస్థ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్, కెబిఆర్ పార్కు, మైండ్ స్పేస్, ఎల్బీనగర్, బహద్దూర్‌పురా తదితర ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఇదీ స్థల సేకరణ
మరోవైపు ఈ పైన పేర్కొన్న ప్రాంతాల్లో వంతెనలు, స్కైవేలు, స్కైవాక్స్‌లు, గ్రేడ్ సెపరేటర్లు మొదటి దశ నిర్మాణం కోసం జిహెచ్‌ఎంసి అధికారులు 319 ప్రాంతాలను స్థల సేకరణ నిమిత్తం గుర్తించారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్‌లోనే 21 ఆస్తులను గుర్తించారు. ఫిల్మ్‌నగర్ జంక్షన్‌లో ఆరవు, రోడ్ నెం. 45 జంక్షన్‌లో 8, కెబిఆర్ పార్కు ఎంట్రెన్స్‌లో ఉన్న జంక్షన్ వద్ధ మరో 11, మహారాజ అగ్రసేన్ చౌక్ వద్ధ మరో పది ఆస్తులు, అలాగే బహద్దూర్‌పురా జంక్షన్ వద్ధ 58, కామినేని ఆసుపత్రి నుంచి ఎల్బీనగర్‌ల మధ్య నాలుగు ఆస్తులను భూ సేకరణ నిమిత్తం గుర్తించారు. ఎల్మీనగర్-చింతలకుంటల మధ్య ఏడు, ఎల్బీనగర్-సాగర్ రోడ్డుల మధ్య 5, ఎల్బీనగర్ జంక్షన్‌లో 42, బిగ్ బజార్ నుంచి మన్సూరాబాద్‌ల మధ్య మూడు ఆస్తులను సేకరణ నిమిత్తం గుర్తించారు. కామినేని జంక్షన్‌లో 29, బైరామల్‌గూడ జంక్షన్‌లో 71, కెపిహెచ్‌బిలోని రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద నాలుగు, కంచన్‌బాగ్‌లోని ఓవైసి ఆసుపత్రి వద్ధ మరో పదకొండు ఆస్తులను జిహెచ్‌ఎంసి అధికారులు ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టుల కోసం గుర్తించారు. దీనికి తోడు 60 ప్రభుత్వ స్థలాలు, 260 ప్రైవేటు ఆస్తుల స్థలాలను సేకరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కెబిఆర్ పార్కు వద్ధ హెచ్‌ఎండిఏకు చెందిన తొమ్మిది ఎకరాలు సేకరించాలని యోచిస్తున్నట్లు అదికారులు తెలిపారు.
ఏప్రిల్ నెలాఖరుతో ముగియనున్న గడువు
ఎస్‌ఆర్‌డిపి తొలి దశ పనులకు జిహెచ్‌ఎంసి అధికారులు చేయాల్సిన స్థల సేకరణకు ఏప్రిల్ మాసం చివరితో గడువు ముగియనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి, పట్టణాభివృద్ధిశాఖ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏప్రిల్ మాసం చివరి కల్లా స్థల సేకరణ చేసి ఎజెన్సీకి అప్పగిస్తే ఆ సంస్థ జూన్ మొదటి వారంలో పనులు ప్రారంభించుకుంటుందని మంత్రి అధికారులను ఆదేశించారు.