జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరులో పటిష్ఠమైన సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉగ్రవాదంపై యుద్ధంలో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలనే దృఢ సంకల్పాన్ని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) శుక్రవారం వ్యక్తం చేశాయి. అన్ని దేశాలు రాజ్యేతర శక్తుల కార్యకలాపాలను నియంత్రించి తీరాలని, తమ గడ్డ మీదినుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలకు అన్ని రకాల మద్దతును ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి మతాన్ని ఉపయోగించుకోవడాన్ని, ఉగ్రవాద జాడ్యానికి మద్దతు ఇవ్వడాన్ని, ప్రోత్సహించడాన్ని ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. దేశ విధానంలో పనిముట్టుగా ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడాన్ని కూడా ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాద జాడ్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఇరు దేశాలు శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ గురువారం ఇక్కడ విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన మరుసటి రోజే ఇరు దేశాలు ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భద్రతకు సంబంధించిన అంశాలపై సన్నిహితంగా కలిసి పనిచేయడాన్ని కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఈ సంయుక్త ప్రకటన తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీర ప్రాంత భద్రత, సైబర్ సెక్యూరిటి వంటి అంశాలలో కలిసి పనిచేయడాన్ని మున్ముం దు కూడా కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.