ఉత్తరాయణం

సీరియల్స్‌కూ సెన్సార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీరియల్స్‌లో ఇటీవలి కాలంలో హింసాప్రవృత్తిని ప్రేరేపించే సన్నివేశాలు ఎక్కువయ్యాయ. అసలే నేటి సమాజంలో హింస ఎక్కువవుతుంటే దానికి కొత్త సీరియల్స్ తోడవుతున్నాయి. మంచిని నేర్పించాల్సిన సీరియల్స్ చెడును ప్రోత్సహిస్తున్నాయి. ఒక సీరియల్‌లోని ఓ సన్నివేశంలో మంగళ స్నానం చేసే నీటిలో యాసిడ్ పోయటం, మెహందీలో చేతులు కాలిపోయే కెమికల్స్ కలపినట్లు చూపించారు. కథను సాగదీస్తూ భర్తఅత్తమామలు, కన్నతండ్రి, సవతి కూతురిని, పిన్ని తీవ్రంగా హింసించటం లాంటి సన్నివేశాలు ప్రతి రోజూ వచ్చే ఎపిసోడ్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఫ్యాక్షనిస్టు కక్షల నేపథ్యంతో తీసే సీరియల్స్‌లో హింసాత్మక దృశ్యాలకు అడ్డే లేదు. హింసను ప్రేరేపించే దృశ్యాలను, సన్నివేశాలను సెన్సార్ చేయాలి. టీవీ సీరియల్స్‌కు సైతం సెన్సార్ ఉండాలి.
- అయిని రఘురామారావు, ఖమ్మం
అలా చేస్తేనే తెలుగు వెలుగు
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, పూర్వవైభవానికి తెలుగు అధ్యయన కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నయ్, ఒడిశా, కర్ణాటకల్లో క్షేత్రస్థాయి సమావేశాలను నిర్వహించి తెలుగు రచయితలు, కళాకారుల అభిప్రాయాలను సేకరించిన అధ్యయన కమిటి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం సంతోషదాయకం. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని, వృత్తి విద్యాకోర్సుల్లోను ఓ సబ్జెక్టుగా ఉంచాలని, గ్రామ సచివాలయం నుంచి శాసనసభ, శాసన మండలి వరకు తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలను నిర్వహించాలని, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
చొరబాట్లను అడ్డుకోలేమా?
పాకిస్తాన్ నుంచి మనదేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్ లేదా మిలటరీ యూనిఫాంలో పాక్ ఉగ్రవాదులొచ్చి మన జవాన్లతో కలిసిపోయి హింసకు పాల్పడుతున్నారు. యూనిఫాంలో వున్నవాళ్లు మన సైనికులేనా కాదా అన్నది ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అలా కనిపెట్టడానికి తగిన సాధన సామగ్రి మనవద్ద లేదా? ఈ మధ్య కాలంలో పాక్ ఉగ్రవాదులు ఎంచుకున్న ఈ ఎత్తుగడను చిత్తు చేసే దిశగా అటు సైన్యం, ఇటు ప్రభుత్వాలు అడుగులు వేయాలి.?
- చంద్రిక, రాజేంద్రనగర్
పునరుద్ధరించాలి
తెలుగు రాష్ట్రాలలోని ఎన్నో చారిత్రక నిర్మాణాలు కోటలు, దేవాలయాలు తదితరాలు ఆయా రాజుల కాలంలో నిర్మింపబడి, అభివృద్ధి చెందుతూ వైభవోపేతంగా ఉండేవి. కేవలం చరిత్రకు సాక్ష్యాలుగానే మిగిలాయి. అలాంటి వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతోఉంది. ప్రభుత్వంవారు అటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను గుర్తించి, అభివృద్ధిపరచి, పర్యాటక శోభను తేవాలి. అభివృద్ధిలో భాగంగా మ్యూజియంలు, పార్కులు మొదలైనవి నిర్మించాలి. రోడ్లను నిర్మించాలి. ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేయాలి. తద్వారా దేశ, విదేశ పర్యాటకులకు ఇవి కనువిందు చేస్తాయి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం