ఉత్తరాయణం

మానవ హక్కులు మనకు అమెరికా బోధించాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయట.. ఈ విషయమై అమెరికా ప్రభుత్వం ఒక నివేదికను మన ప్రభుత్వానికి పంపించింది. ఇతర దేశాల నుంచి డబ్బు అందుకుంటున్న ‘సేవా’ సంస్థలను మన ప్రభుత్వం క్షోభ పెడుతోందట! ( అంటే మత మార్పిడి సంస్థలను అని అర్థం) మతాలూ, కులాలూ, ఆడవాళ్లూ వగైరా అందరి పట్లా మానవ హక్కులకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ప్రవర్తిస్తోందట. కనుక తన పద్ధతి మార్చుకోవాలట. ఎంతో సంస్కారవంతమైన సంస్కృతితో విరాజిల్లిన ఇంకాస్, మాయా, రెడ్ ఇండియన్స్ వగైరా జాతులు అన్నింటినీ సమూలంగా సర్వనాశనం చేసి మూడు వందల ఏళ్ల కిందట ఆ భూమికి ‘అమెరికా’ అని నామకరణం చేశారు. ఓడలమీద వెళ్లి ఆ విధ్వంసానికి, వినాశనానికి పాటుపడిన వాళ్లు అందరూ యూరేపియనే్ల- ఇటాలియన్స్, ఇంగ్లీష్, డచ్ తదితరులు. వీళ్లు అందరూ యూరోపియనే్ల. ఒక్క హిందువు కూడా లేడు. ఆ పిశాచుల వారసులే ఇప్పుడు అమెరికాను ఏలుతున్నారు. మన దేశంలో ఏ కులమూ ‘బానిస’ అనే విధంగా చూడబడడం ఎప్పుడూ లేదు. కానీ ఆఫ్రికా ఖండం మొత్తాన్ని వాళ్లు బానిసలుగా చూసి, పీల్చి పిప్పి చేశారు. ఇప్పుడు ప్రపంచాన్నంతటినీ శాసిస్తున్నారు. ఈ పిశాచులా..? మనకు మానవత్వం గురించి నీతులు బోధించేది!
- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు

మహిళా బిల్లుకు మోక్షం లేదా?
అమరావతిలో ఇటీవల నిర్వహించిన ‘జాతీయ మహిళా పార్లమెంటు’ సదస్సులో చట్టసభల్లో స్ర్తిలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఇతర హక్కులు, సౌకర్యాలు కల్పించాలని నేతలు ఘనంగా ఉపన్యాసాలిచ్చారు. సదస్సు సందర్భంగా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకుంటాయా? అన్న సందేహాలు లేకపోలేదు. మహిళా బిల్లు దశాబ్దాలుగా మూలబడి ఉంది. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాష్టప్రతి ప్రతిభాపాటిల్ కీలక పదవుల్లో ఉన్నప్పుడే మహిళా బిల్లుకు మోక్షం లభించలేదు. ఉపన్యాసాలకే పరిమితవౌతున్న మహిళా బిల్లు చట్టమవుతుందన్న నమ్మకం కలగడం లేదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
నల్లకుబేరుల్లో బెదురు లేదు
అవినీతి అంతం కావలసిందే. అది కేవలం ప్రధాని మోదీ పంతం మాత్రం కాకూడదు. ప్రధానితోపాటు యావత్ ప్రజానీకం అవినీతి అంతానికి దీక్ష వహించాల్సిందే. అవినీతి ఈనాటిది కాదు. కలియుగంలో ఇది మరింత బలిసింది. గతంలో ప్రభుత్వాలేవీ కూడా అవినీతిని రూపుమాపడానికి శ్రమించిందేమీ లేదు. అవినీతి, నల్లధనం అంతానికి పెద్దనోట్ల రద్దు ఒక్కటే పరిష్కార మార్గమా? అవినీతిపరులైన నాయకులు, ఉన్నతాధికారులు నల్లధనాన్ని విదేశాలకు తరలించి అక్కడి బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. దాన్ని వెనక్కి రప్పించడానికి సమరభేరి మోగించినట్లు మోదీ చెబుతున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పెద్దనోట్లు రద్దు చేసి నాలుగు నెలలు కావస్తున్నా నల్లకుబేరుల్లో చలనం ఏ మాత్రం కన్పించలేదు. అవినీతి ఎక్కడ చూసినా వికృతరూపంలో దర్శనమిస్తోంది.
- కె.వి.రమణమూర్తి, కాకినాడ
ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
ప్రతి వ్యక్తికీ మాతృభాషపై అభిమానం ఉండొచ్చు. అది వారి వ్యక్తిగత విషయం. కానీ, అది తిండి పెట్టదని తెలుసుకోవాలి. నేడు ఇంగ్లీషు భాష చాలా ముఖ్యం. ఎందుకంటే అది అంతర్జాతీయ భాష. తెలుగు కేవలం ప్రాంతీయ భాష. వేరే ప్రాంతాల్లో, దేశాల్లో తెలుగు రానివారితో మాట్లాడాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. నేడు విద్యార్థులు ఇంగ్లీషు భాషను విధిగా నేర్చుకోవలసిందే. విద్యార్థులే కాదు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు కూడా ఇంగ్లీషు నేర్చుకోవాలి. భాష రాక చాలామంది క్రొత్త ప్రదేశాలలో మోసపోతుంటారు. మంచి ఉద్యోగాలు పొందాలన్నా ఆంగ్లభాషలో తగిన పరిజ్ఞానం ఉండాలి. కనుక మాతృభాషతో పాటు ఆంగ్లభాషను కూడా విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి నేర్పించాలి.
- వి.కామాక్షి, విశాఖ