ఉత్తరాయణం

ఇప్పుడైనా మేల్కొందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ మారుతున్న వాతావరణం
ఎండవేళ సూర్యుని భగభగలతో రణం
వానాకాలం కానరాని చినుకు
సంవత్సరమంతా ఎండల వేడిమితో
మానవుని కంటికి లేదు కునుకు
అధికమవుతున్న కాలుష్యం
ఎల్‌నినో, వాన్‌నినోల ప్రతాపం
జీవరాశి మనుగడే ప్రశ్నార్థకం
పెరుగుతున్న మన జనాభా
అన్నింటా మితిమీరిన స్వార్థం
అంతరిస్తున్న వృక్షజాలం
వనాలను నరకడంలో మొనగాళ్ళం
తిరిగి నాటడంలో సోమరులం
మనకే చుట్టుకుందిలే ఆ పాపం
మేల్కొనకపోతే మనకే శాపం
ప్రతి ఒక్కరం జాగృతమవుదాం.
విరివిగా మొక్కలు నాటుదాం
వాటిని బిడ్డల వలే సంరక్షిద్దాం
హరిత మయం కావాలి మన భారతం
విశ్వానికి ఆదర్శం కావాలి మన చరితం.

కొత్త జిల్లాలు అవసరమా?
పరిపాలనా సౌలభ్యం కోసమా? కొంతమేరకైనా నిరుద్యోగం పరిష్కారానికా? ఉన్న వాటితో అభివృద్ధి చెందడం కష్టమనా? జిల్లాలను, నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెగ ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పది నుంచి ముప్పయి ఒకటికి పెంచింది. ఏపిలో మాత్రం ఇంకా జిల్లాలను పెంచాలన్న విషయమై దృష్టి సారించలేదు. రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ప్రజాధనం మరింతగా ఖర్చుకాక తప్పదు. ఏపి రాజధాని అమరావతికి ఇంకా ఓ స్వరూపం రాలేదు. రహదారులు లేవు, భవనాలు లేవు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి మరో పదేళ్లయినా పడుతుంది. గనుక ఏపిలో ఇప్పట్లో జిల్లాలు, నియోజకవర్గాల సంఖ్య పెంచడం అంత అవసరమా?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
‘సమాచార దర్శిని’ ముద్రించాలి
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి సంబంధించిన ‘సమాచార దర్శిని’ (డైరీ)ని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విజయవాడ ప్రాంతంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. అన్ని కార్యాలయాల చిరునామాలతోపాటు ఫోన్ నెంబర్లను ప్రచురించి సమాచార దర్శినిని విడుదల చేయాలి. రైల్వే, బస్సుస్టేషన్ల నుంచి ఆయా కార్యాలయలకు వెళ్ళే సిటీ బస్సుల నెంబర్లను పొందుపరచాలి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే ఈ పనిని పూర్తిచేయించి, అమరావతి డైరీని ప్రచురించి విడుదల చేయాలి. ఈ డైరీని ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు విక్రయించాలి. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రజలకు అందజేయవచ్చు.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
చార్జీల వడ్డన సరికాదు
అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న అదనపు చార్జీల వడ్డన వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదు. బీదవాళ్లకు కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకుల్లోను ఖాతాలు ఏర్పాటు చేయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం మేరకు పేదలు తెరచిన జన్‌ధన్ ఖాతాలు భారంగా మారాయని ఎస్‌బిఐ భావిస్తోంది. పేదలు తమ ఖాతాల్లో రు.5,000/ కనీస నగదు నిల్వలు ఎలా కొనసాగిస్తారు? సేవింగ్సు ఖాతాల్లో రు.500/- కంటే ఎక్కువ వుంచే శక్తి వారికి లేదు. ఎటిఎంల నుండి విత్‌డ్రాలను నెలకు కనీసం ఐదు సార్లయినా ఉచితంగా తీసుకునే అవకాశం కల్పించాలి. కనీస నగదు నిల్వ నిబంధనలు మార్చరాదు. సేవల ముసుగులో ప్రజలను వేధించటం సరికాదు. ఎస్‌బిఐ నిబంధనలను సడలించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం