ఉత్తరాయణం

ఆ ఎంపీలను దండించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహంకారం, అజ్ఞానం కలసి అలంకారంగా తయారైనట్టుంది కొంతమంది ప్రజాప్రతినిధులకి. తప్పుచేసి దొరికిపోయిన శివసేన సభ్యుడికి మద్దతుగా ఆయన పార్టీ నేతలు పార్లమెంటులో సృష్టించిన హడావుడి జుగుప్సాకరం. పౌర విమానయాన మంత్రిని మూకుమ్మడిగా చుట్టుముట్టడం, హంగామా చెయ్యడం చూస్తే ఎవరైనా అది ప్రజలకు సంబంధించిన ముఖ్య విషయమో లేదా రాష్ట్ర, దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ముఖ్యాంశమో? అని భ్రమపడతారు. శివసేన పార్టీకి చెందిన విద్యావంతుడైన పార్లమెంటు సభ్యుడు, తాను విమానయాన సంస్థ అధికారిని పాతికసార్లు చెప్పుతో కొట్టినట్టు సగర్వంగా ప్రకటించాడు. ఈ చర్యకు బదులుగా విమానయాన సంస్థలు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. వాస్తవంగా చూస్తే ఇది చాలా స్వల్పమైన శిక్ష లాంటిది. జరిగి ఇంకా నెల కాలేదు. ఈలోగా గౌరవ సభ్యుడు విమానయానం లేక అల్లల్లాడిపోవడం ఒక ఎత్తయితే, తమ ఎంపీ గౌరవానికి భంగం జరిగినట్టు ఆ పార్టీ సభ్యులంతా గగ్గోలు పెట్టడం మరో ఎత్తు. దురుసుగా ప్రవర్తించడం, దాడికి యత్నించడం ఏ ‘రూల్ బుక్’ ప్రకారం చట్ట సభ్యుడి హక్కులౌతాయో వారే సెలవియ్యాలి. ప్రస్తుతం అదే సభ్యుడు మాట మార్చి తాను దాడి చెయ్యలేదని, సదరు ఉద్యోగియే అనుచితంగా ప్రవర్తించాడని ప్రకటించారు. ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అహంకారాన్ని అలంకారంగా ధరిస్తే, అదుపులో పెట్టాల్సిన బాధ్యత చట్టసభలకుంది.
- డా.డివిజి శంకరరావు,పార్వతీపురం
కాశీకి పోదామంటే కష్టాలే!
పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించి, కాశీ విశే్వశ్వరుని దర్శించి పునీతులౌదామని అనునిత్యం కాశీ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కాశీని సందర్శించే తెలుగు వారి సంఖ్య లక్షలలోనే వుంటుంది. సరైన రవాణా సౌకర్యాలు లేక వీరు చాలా అవస్థలు పడుతున్నారు. కాశీ వెళ్లాలంటే పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మూడు నెలల ముందు ప్రయత్నించినా రైళ్లలో రిజర్వేషన్ లభించడం లేదు. హైదరాబాద్, విజయవాడ నుండి వున్న విమాన సౌకర్యాలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. రెండు, మూడు రైళ్లు మారి గమ్యం చేరడం యాత్రికులకు కష్టంగా వుంటోంది. రైల్వేశాఖ హైదరాబాద్, విజయవాడల నుండి కాశీకి నేరుగా రైళ్లను ప్రతిరోజు నడిచేలా ప్రవేశపెడితే తెలుగు ప్రజలకు చాలా సౌకర్యంగా వుంటుంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి
భారత్‌పై విష ప్రచారం
భారత్‌లో మానవ హక్కులకు తీవ్రంగా భంగం వాటిల్లుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తన తాజా నివేదికలో బురద జల్లేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదం. గత దశాబ్ద కాలంలో కొన్ని ఎన్.జి.వోలు విదేశాల నుండి భారీగా నిధులు తీసుకువచ్చి ఇక్కడ మతం మార్పిడులు చేపట్టాయి. అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆర్థిక, సాంస్కృతిక దురాక్రమణ నిర్విఘ్నంగా చేశాయి. అన్యమత ప్రార్థనా మందిరాల సంఖ్య విశృంఖలంగా పెరిగిపోవడం గమనార్హం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక విదేశీ నిధులు పొందే ఎన్‌జివోలపై కొరడా ఝళిపించింది. పారదర్శకత లేని సంస్థలను మూయించి వేసింది.