ఉత్తరాయణం

పాకిస్తాన్ లేకి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ని గూఢచారిగా చిత్రీకరిస్తూ పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించడం అత్యంత కిరాతక చర్య. అన్ని అంతర్జాతీయ న్యాయసూత్రాలనీ, మర్యాదల్నీ, నియమాల్నీ నిస్సిగ్గుగా ఉల్లంఘించిన ఉదంతం ఇది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఇనే్నళ్లలో ఏ ఒక్కరూ ఏ దేశంలోనూ గూఢచర్యం నేరంపై మరణశిక్షకి గురి కాలేదు. ఒకవేళ శత్రుదేశపు గూఢచారులుగా భావిస్తే ఆ వివరాల్ని ఆ నిందిత దేశంతో పంచుకోవాలి, చర్చించాలి. ఇలాంటివేవీ లేకుండా హఠాత్తుగా ఒక భారతీయుడ్ని నిర్బంధించి మరణశిక్ష విధించామని ప్రకటించడం పాకిస్తాన్ చేస్తున్న అతి తెలివి యుద్ధ వ్యూహం. మరోవైపు పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద మూకలు ఆ దేశంపైనే కత్తి కడుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతం ఉగ్ర బీభత్సంలో చిక్కుకుంది. తన వైఫల్యాన్ని, భస్మాసుర పాత్రని ఒప్పుకోవడం కంటే ఆ నింద భారత్‌పై నేట్టేయడం పాక్ సైన్యానికి, ప్రభుత్వానికీ రెండు విధాలా లాభం. భారత్ ప్రతిష్ఠ మసకబారొచ్చు, తన వెధవాయిత్వం మరుగున పరచొచ్చు. అయితే ఈ దుందుడుకు వ్యూహాలకు పాక్ మూల్యం చెల్లించేలా భారత్ అంతర్జాతీయంగా వత్తిడి తీసుకురావాలి. జాదవ్ గూఢచర్యానికి సరైన ఆధారాలు లేవు. తత్సంబంధిత సమాచారాన్ని మన ప్రభుత్వానికి తెలియజేయలేదు. కేసు విచారణ గోప్యంగా, ఏకపక్షంగా జరిగింది. ఆ దేశపుపౌర న్యాయస్థానంలో దీనిపై పునర్ విచారణ జరగాలి. నిందితుడికి సంపూర్ణ న్యాయ సహాయం భారత్ తరఫున అందేలా అవకాశం ఇవ్వాలి. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి. మరణశిక్ష నిలుపుదల తప్ప మరోమాటకు తావులేదని పాక్‌కి విస్పష్టంగా తెలియజేసిన భారత ప్రభుత్వం, ఆ దిశగా అన్ని కోణాల్లో కార్యాచరణని వేగవంతం చేయాల్సిన అవసరముంది.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
స్వచ్ఛమైన కల్లు అందించలేరా?
వేసవి కాలంలోనైనా స్వచ్ఛమైన తాటికల్లు తాగుదామంటే ఎక్కడా లభించదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల తాటిచెట్లు, వేలకొద్దీ గీతపనివారు ఉన్నప్పటికీ ఎక్కడా స్వచ్ఛమన కల్లు విక్రయించరు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లును రసాయన పదార్థంతో కలిపి విషంగా మార్చి విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీకల్లు తాగి ఎందరో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇక, వృత్తి సంఘాల ద్వారా గీతపారిశ్రామికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, చెట్లు ఎక్కేందుకు యంత్ర పరికరాలను అందచేయాలని, చెట్టుపైనుండి ప్రమాదవశాత్తు పడి మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలని గీతకార్మికులు ఆందోళన చేస్తారు. కానీ, వారు వృత్త్ధిర్మంగా స్వచ్ఛమైన కల్లు విక్రయించాలనే ఆలోచన చేయరు. గీత పారిశ్రామిక సంఘాలు ప్రతి పట్టణంలోనూ వేసవి కాలంలో కల్లు విక్రయించే ఏర్పాటు చేయాలి. ఇందుకు ప్రభుత్వం కూడా పూనుకుని సత్వరం తగిన చర్యలు చేపట్టాలి.
-బి.సత్యప్రకాశ్, సూర్యాపేట
పనిచేయని పెన్షన్ వెబ్‌సైట్
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లకు సంబంధించిన వెబ్‌సైట్ ప్రస్తుతం పని చేయడం లేదు. పెన్షనర్లకు ఎంతో ఉపయుక్తమైన దఆఆఔఒ://ఆళ్ఘఒఖూక.్ఘఔ.్య్ప.జశ/ఔళశఒజ్యశఒ/జశజూళన.ఔ్దఔ అనే వెభ్‌సైట్‌లో పెన్షనర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ‘లింక్’ క్లిక్ చేస్తే ‘స్క్రీన్’ ఓపెన్ అవుతోంది. కానీ, అందులో ఒళళషఆ జూజఒఆజషఆ శ్ఘౄళ: అన్న చోట సెలెక్ట్ చేసి క్లిక్ చేసినా జిల్లాల లిస్టు రావడం లేదు. అన్ని వివరాలు నింపినా పెన్షనర్ అకౌంట్ ఓపెన్ కావడం లేదు. ఒఆ్యష్యజూళఔఔ్యజజూఔఔ్యశ్యఔఔ్యశ్ఘౄళజ్యూషఘ/షశ్యఔళశఒజ్యశూఖళఇ్ఘశరీ అన్న పట్టిక మాత్రమే వస్తోంది. తక్షణం సంబంధిత అధికారులు ఈ వెబ్‌సైట్‌ను సరిచేసి పెన్షనర్లకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- సివిఆర్ కృష్ణ, హైదరాబాద్