జాతీయ వార్తలు

పాంపోర్‌లో ముగిసిన ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఇక్కడి పాంపోర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులకు సోమవారం సాయంత్రం తెరపడింది. సైనికులు కాల్పులను విరమించినప్పటికీ, ప్రభుత్వ భవనంలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. సైనికులు ఆదివారం నాడు ఓ ఉగ్రవాదిని హతమార్చిన సంగతి తెలిసిందే. మూడురోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు సైనికులు, ఒక పౌరుడు, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.