జాతీయ వార్తలు

కూలిన ఇళ్లు.. కలుషితమైన నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాం, ఏప్రిల్ 13: కూలిపోయిన ఇళ్ల్లు.. కలుషితమైన నీళ్ల్లు.. రసాయనాలు కలిసిపోయిన పదార్థాల అవశేషాల దుర్గంధాలు, పేరుకుపోయిన కాంక్రీట్ చెత్త.. పుట్టింగల్ దేవి ఆలయంలో 113 మందిని పొట్టన పెట్టుకున్న దుర్ఘటన కొల్లాం ప్రజలకు మిగిల్చిన విషాదమిది. ఆలయ పరిసరాల్లో చాలా కుటుంబాలు ఈ దుర్ఘటన తరువాత బంధువుల ఇళ్లకు వలసవెళ్లాయి. ఎక్కడికీ వెళ్లలేని వారు మాత్రం తమ ఇళ్లను మరమ్మతు చేసుకునే పనిలో పడ్డారు. అన్నింటికీ మించి కొల్లాంలో ఇప్పుడు మంచినీరు తాగాలంటే తెగ భయపడిపోతున్నారు. బావుల్లోంచి నీళ్లు తీసుకోవటానికి అంగీకరించటం లేదు. మున్సిపల్ ట్యాంకర్ల నుంచి వచ్చే నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బాణసంచా ప్రమాదం వల్ల నీళ్లు దారుణంగా కలుషితమై పోవటమే కాకుండా ఆ నీళ్లలో మానవ అవశేషాలు ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. నీటి కాలుష్యం, మంచినీటి సమస్యను పరిష్కరించటానికి కేరళ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని బుధవారం ఏర్పాటు చేసింది. మరోవైపు ఆధికారులు ఆలయం చుట్టుపక్కల ఉన్న బావుల్లో, బోరుల్లోని నీటి నమూనా సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు శిథిలాల కింద ఇంకా పేలని బాణసంచా పెద్దఎత్తున ఉండటంతో స్థానికుల్లో భయం ఎక్కువైపోయింది.
కొల్లాం ప్రజలకు ఢిల్లీ చర్చి సంఘీభావం
న్యూఢిల్లీ: కేరళలోని పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన దుర్ఘటన బాధితులకు ఢిల్లీలోని బిలీవర్స్ చర్చి సంఘీభావం తెలిపింది. బాధితులకు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు, బట్టలు పంపిస్తున్నట్లు చర్చి బుధవారం పేర్కొంది. ‘మా పరిధిలో మేం ఎంతవరకు చేయగలమో అదంతా చేస్తున్నాం..’ అని చర్చి ప్రతినిధి కేపీ యోహనన్ వివరించారు.

పేలుళ్లతో ధ్వంసమైన పుట్టింగల్ దేవి ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్న జనం

గుండెపోటు వల్లే
కృపాల్ సింగ్ మృతి

భారత్‌కు తెలిపిన పాక్ ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారతీయ ఖైదీ కృపాల్ సింగ్ రెండు రోజుల క్రితం లాహోర్ జైల్లో గుండెపోటుతో మరణించినట్లు పాకిస్తాన్ బుధవారం భారత ప్రభుత్వానికి తెలియజేసింది. కృపాల్ సింగ్ అనుమానాస్పద మృతి విషయాన్ని భారత అధికారులు పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత పాక్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా, ఈ విషయంలో మరిన్ని వివరాలకోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. పాకిస్తాన్‌లో వరస పేలుళ్లకు సంబంధించి కృపాల్ సింగ్ గత పాతికేళ్లుగా లాహోర్ జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా, కృపాల్ సింగ్ మృతికి సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు పాక్‌లో భారత తాత్కాలిక హైకమిషనర్ జెపి సింగ్ బుధవారం ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్ జనరల్‌ను కలిశారు. ‘పాక్ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం కృపాల్ సింగ్ ఈ నెల 11న మధ్యాహ్నం 2.55 గంటలకు గుండెపోటు కారణంగా మృతి చెందారు. మరిన్ని వివరాలకోసం ఎదురు చూస్తున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.
కృపాల్ సింగ్ భౌతికకాయాన్ని వీలయినంత త్వరలో భారత్‌కు అప్పగించాలని కూడా సింగ్ పాక్ విదేశాంగ శాఖ అధికారిని కోరినట్లు ఆయన చెప్పారు. గూఢచర్యం ఆరోపణలపై 50 ఏళ్లకృపాల్ సింగ్ గత పాతికేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్నాడు. 1992లో వాఘా సరిహద్దు గుండా పాక్‌లోకి ప్రవేశించిన ఆయనను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో వరస బాంబు పేలుళ్ల కేసులో ఆయనకు మరణశిక్ష విధించారు.

అయితే గురుదాస్‌పూర్‌కు చెందిన కృపాల్ సింగ్‌ను బాంబు పేలుళ్ల కేసులో లాహోర్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది కానీ, ఏ కారణాల చేతనో ఆయన మరణశిక్ష మాత్రం రద్దు కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుటుంబం కృపాల్ సింగ్‌ను విడుదల చేయాలని గట్టిగా కోరలేక పోయిందని, ఏ రాజకీయ నాయకుడు కూడా అతని కేసును వాదించడానికి ముందుకు రాలేదని ఇంతకుముందు కృపాల్ సోదరి జాగీర్ కౌర్ చెప్పింది.

పనామా లీకేజీలపై
పోలీసులు ఆరా!
సంస్థ హెడ్‌క్వార్టర్స్‌పై దాడులు
పనామ్ సిటీ, ఏప్రిల్ 13: విదేశీ బ్యాంకు అకౌంట్లు బయటపెట్టి ప్రపంచాన్ని ఓ కుదుపుకుదిపిన పనామా మొస్సాక్ ఫొనె్సకా ప్రధాన కార్యాలయంపై సిటీ పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు బ్రాంచీలపై సోదాలు జరిగాయి. పనామా హెడ్ క్వార్టర్స్‌పై దాడి జరిగిన విషయాన్ని ధ్రువీకరించిన ప్రాసిక్యూటర్లు మిగతా వివరాలేవీ వెల్లడించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియా, మెక్సికో, పెరూ, స్పెయిన్ తదితర దేశాల సంపన్నులు స్వదేశాల్లో పన్నులు ఎగవేసి సొమ్ములను తరలించినట్టు పనామా పత్రాలు బయటపెట్టాయి. సుమారు 11.5 లక్షల డాక్యుమెంట్లు లీక్ చేయడంతో తీవ్ర సంచలనమైంది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు మొస్కాక్ ఫొనె్సకా ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించారు.