జాతీయ వార్తలు

ఉన్నావోలో మరో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో దారుణం జరిగింది. కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని పెట్రోల్ పోసి దహనం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి, ఉన్నావ్ జిల్లాలో తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న మహిళపై అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఒక నిందిడుడ్ని పోలీసులు అరెస్టు చేయగా.. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్లి వస్తుండగా..ఐదుగురు వ్యక్తులు ఊరి చివర ఆమెకు నిప్పు పెట్టి పరారయ్యారు. 70శాతం కాలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తి.