జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల పరిధిలోని అడవుల్లో వ్యాపించిన మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 450 ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో మంటల్ని ఆర్పివేస్తామని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ల ద్వారా అడవులపై నీటిని చల్లుతూ మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా వందలాది గ్రామాల ప్రజలు పొగతో నానా అవస్థలు పడుతున్నారు.