ఉత్తరాయణం

సుప్రీం సూచన పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో దోమలను పూర్తిగా నిర్మూలించడం ఎవరి చేతుల్లోనూ లేదని, అది అసాధ్యమని, కేవలం భగవంతుడివల్లే అలాంటివి సాధ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం నూటికి నూరుపాళ్లు నిజం. దోమల నివారణలో ప్రభుత్వాలు విఫలమైనాయని, డెంగ్యూ వంటి ప్రాణాంతక రోగాల వ్యాప్తికి అవి కారణమవుతున్నాయని, వాటి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై సుంప్రీం స్పందించింది. ఇది ఏ ఒక్కరివల్లో కాదని, మీ ఇంట్లో దోమలను పూర్తిగా మీరు నిరోధించగలరా అని పిటిషనర్‌ను సుప్రీం ప్రశ్నించడం సరైన విషయం. ఎవరికివారు వారి ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వాలు మరిన్ని మేలైన చర్యలు త్వరితగతిన తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
-బి.మధుసూదన్ రెడ్డి, కర్నూలు
అమరావతి
అనుమానమే!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణాలు అనమానమే. అందుకే ఆ ప్రయత్నాన్ని భ్రమరావతి అన్న రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ విమర్శ సహేతుకమే. అమరావతి నిర్మాణం అంతా బొమ్మల్లోనే. రోజుకో బొమ్మను పరిశీలిస్తున్నారు..అంతే.
-డి.ఎం.రాజు, విజయవాడ
ఆర్టీసీ బాదుడు
పండుగలు, సెలవులు వస్తే ఆర్టీసీకి పండుగే. ప్రయాణీకుల అవకరాన్ని గమనించి ఆ రోజుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం మామూలైపోయింది. అసలు ఛార్జీకి మరో సగం ఎక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ సరైన బస్సులు వేయరు. ఈ సందర్భంగా వేసే అదనపు బస్సులు సౌకర్యంగా ఉండవు. ఆదాయంపై దృష్టి పెట్టే ఆర్టీసి ప్రయాణికుల భద్రతపై ఏమాత్రం శ్రద్ధచూపడం లేదు
-అయినం రఘురామారావు, ఖమ్మం