ఉత్తరాయణం

భూసర్వేతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూసర్వే కార్యక్రమం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారికి కష్టాలు తప్పవు. రామగుండం పారిశ్రామిక వాడలోని గోదవారిఖని, శ్రీరాంపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాల్టీలలోని సింగరేణి భూములను చాలామంది ఆక్రమించారు. మంచిర్యాలలోని ఒక సినిమా థియేటర్ సమీపంలోని ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన నేత ఒకరు కబ్జా చేశారు. అత్యంత విలువైన స్థలాలను ఇప్పటికే రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూసర్వే చిత్తశుద్ధితో చేస్తే అసలు బండారం బయటపడుతుంది. కబ్జాచేసినవారిని దండించి కోట్ల విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
-ఆర్.శంకర్, మందమర్రి
ఒప్పంద
ఉద్యోగుల గోడు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 13వ ఆర్థికసంఘం పథకాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను న్యాయశాఖ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 2011లో 253 ప్రత్యేక న్యాయస్థానాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 151 జిఒ ప్రకారం టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్‌లను నెలకు 15వేల రూపాయల జీతం ఇస్తూ నియమించారు. కొత్త జీఒ 95 ప్రకారం ఒప్పంద ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నారు. జీఓ 88 ప్రకారం జ్యూడిషియల్ మినిస్టిరియల్ సర్వీసులు చేసి రిటైర్ ఆయినవారిని కేంద్ర పథకాల్లో నియమించుకోవచ్చని సూచించారు. నిజానికి రిటైర్డు ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ వస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు అవేమీ ఉండవు. అర్హతలు ఉన్న ఒప్పంద ఉద్యోగులకు (జిఒస95 ప్రకారం నియమితులైనవారు) న్యాయం జరిగేలా, వారి జీతాలు పెరిగేలా న్యాయశాఖ సరికొత్త జీఒ విడుదల చేస్తే వారికి మేలు జరుగుతుంది.
-శ్రీలక్ష్మి, వెంకటగిరి (నెల్లూరు)