ఉత్తరాయణం

వివాదానికి తెరదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశ్యులను కించపరుస్తూ పుస్తకం ప్రచురించిన కంచ ఐలయ్య తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా ఆయన ఆ వివాదానికి చరమగీతం పాడాలి. కోమట్లను స్మగ్లర్లుగా చిత్రీకరిస్తూ రాయడం కన్నా తన వాదనలో తప్పేమిటని ఆయన వివాదాన్ని మరింత ముదిరేలా చేయడంలో విజ్ఞత లేదు. తన జీవితంలో చూసిన సమాజంలో వైశ్య సామాజిక వర్గంలో కొందరిని చూసి ఆ వర్గమంతా అలానే ఉంటుందని సూత్రీకరించడం సరికాదు. ఉన్నత విద్యావంతుడైన ఐలయ్య వైశ్యులకు బేషరతుగా క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించాల్సిన అవసరం ఉంది.
-పి.ఎల్.సుజాత, అద్దంకి
పాకిస్తాన్ వక్రబుద్ధి
ఐక్యరాజ్య సమితి సాక్షిగా పాకిస్తాన్ తాను తీసిన గోతిలో తానే పడింది. భారత్‌పై బురదచల్లే ప్రయత్నం చివరకు ప్రహసనమై పాక్ వక్రబుద్ధిని చాటింది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతివాదనకు దిగింది. అందుకు సాక్ష్యంగా తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఫొటోను విడుదల చేసింది. నిజానికి ఆ మహిళ కాశ్మీరీ కాదు. ఆ ఫొటో 2014లో పాలస్తీనాలో గాయపడిన మహిళది. ఆ ఛాయాచిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ అంతర్జాతీయ స్థాయి బహుమతిని పొందాడుకూడా. సామాజిక మాధ్యమం పుణ్యమా అని ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ వేదికపై అలా పాక్ పన్నాగం విఫలమైంది. ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దుష్ప్రచారానికి దిగిన పాకిస్తాన్‌ను ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు క్షమాపణలు కోరాలి. అభిశంసించాలి. సమాచార విప్లవం వర్థిల్లుతున్న ఈ రోజుల్లో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా నిజం బయటపడకతప్పదు. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్‌లో నిజమైన మార్పు రానంతకాలం ఇలాంటి అనుభవాలు తప్పవు.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
జడ్జీలను నియమిస్తేనే ఫలితం
కోర్టులు శనివారాలు కూడా పనిచేస్తే పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం మరికొంత వేగంగా జరుగుతాయని సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్ర చేసిన సూచన ఆహ్వానించదగినదే. అయితే ప్రస్తుతం దేశంలోనున్న అన్ని కోర్టులలో పేరుకుపోయిన లక్షలాది కేసులు పరిష్కారం చేయాలంటే కనీసం మూడువందల ఏళ్లు పడుతుందని ఓ నివేదిక తెలిపింది. దేశంలోని అన్ని కోర్టులలో న్యాయమూర్తులను పూర్తిస్థాయిలో నియమించడం, అమెరికావంటి దేశాల్లో అనుసరించే ‘లా ఆఫ్ లిమిటేషన్’ ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల తీర్పులను కాల పరిమితి మేరకు అప్పటికి లభించిన సాక్ష్యాల ఆధారంగా తీర్పులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటే న్యాయం సత్వరం లభిస్తుంది. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతాయి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్