ఉత్తరాయణం

అవయవదానం.. పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవయవదానం చేస్తున్నవారి వివరాలు బయటకు వెల్లడి అవుతున్నా లబ్దిదారుల వివరాలు అంతగా బయటకు పొక్కడం లేదు. ఇది అక్రమాలకు తావిస్తోంది. అందువల్ల అవయవదానం చేసినవారి వివరాలు, లబ్దిపొందినవారి వివరాలు ప్రభుత్వమే ప్రత్యేక వెబ్ పేజీల్లో వెల్లడించే ఏర్పాటు చేయాలి. నిజానికి లబ్దిదారుడి వివరాలను ఆన్‌లైన్‌లో చూసే ఏర్పాటు చేస్తే అక్రమాలకు అవకాశం ఉండదు. అవయవదానంపై విస్తృత ప్రచారం చేయడం, అంబుడ్స్‌మన్ వ్యవస్థను నెలకొల్పడం, కార్పొరేట్ ఆస్ప్రత్ల్రులో జరిగే అవయవమార్పిడి వ్యవహారాలపై నియంత్రణ ఉండేలా చూడటం తక్షణ అవసరం. అవయవదానం అంశంపై అక్రమాలు జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక స్వచ్చంద సంస్థ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం, రెండు తెలుగు రాష్ట్రాల ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.
-టి.సురేశ్‌కుమార్, రాజమండ్రి

దోపిడీ దొంగల ఆటకట్టించాలి

ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగల దాడి నుంచి మార్టూరు ఎస్‌ఐ బయటపడటం అదృష్టమే. దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేయడం, తెగువతో వ్యవహరించిన ఎస్‌ఐ వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. అయినా కత్తిపోట్ల గాయాలతో అతను తప్పించుకోగలగడంతో ఊపిరిపీల్చుకున్నట్టయింది. జాతీయ రహదారిపై ఇటీవలి కాలంలో దోపిడీ దొంగలు విచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆయుధాలతో వారు దోపిడీలకు దిగుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. పోలీసులు ధైర్యంగా వ్యవహరిస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ పెట్రోలింగ్ పెంచితే దోపిడీ దొంగల ఆట కట్టించవచ్చు.
-బుగ్గన మధుసూదన్ రెడ్డి, బేతంచర్ల

ఉద్దానంలో జల కాలుష్యం!

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అక్కడి లభ్యమవుతున్న నీరు కలుషితం కావడంవల్లే ఇలా జరుగుతోందని ఇంతకాలం ప్రచారం జరిగింది. అదే విషయాన్ని జియగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) సర్వేలో కూడా తేలిందని, అక్కడి నీరు సురక్షితం కాదని ఆ శాఖ అధికారులు చెప్పారని హైదరాబాద్‌లోని నిమ్స్ మాజీ డైరక్టర్ ప్రకటించారు. కానీ తాము అలా చెప్పలేదని జిఎస్‌ఐ అంటున్నది. ఇందులో ఎవరిమాట నమ్మాలి?, ఏది నిజం?
-మైథిలి, సర్పవరం

‘సౌభాగ్య’ పథకం మంచిదే కానీ..

వచ్చే ఏడాదిలోగా అన్ని గ్రామాలకు, ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సౌభాగ్య’ పథకం లక్ష్యం ఉన్నతం. అది విజయవంతం కావాలన్నది అందరి అభిమతం. యుపిఎ హయాంలో మొదలైన విద్యుదీకరణ కార్యక్రమం ఎన్డీయే హయాంలో నిలకడగా సాగింది. ప్రస్తుతం మూడువేల గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగాల్సి ఉండటం సంతోషించదగినదే. పేదలకు ఉచిత విద్యుత్ అందాలన్న దీక్ష మోదీకి ఉన్నది. అయితే అన్ని గ్రామాలకు విద్యుదీకరణ జరిగినా క్షేత్ర స్థాయిలో ఫలాలు అందడం చాలా దూరం ఉన్నట్టే. జనధన్ ఖాతాల పరిస్థితే అందుకు ఉదాహరణ. ఒక గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఉంది, పదిశాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉంటే అది విద్యుదీకరణ చెందిన గ్రామంగా ప్రకటిస్తారట. ఈ లెక్క వింతగానే ఉంది. పేదలకు ఉచితంగా, మిగతావారికి కొంత రుసుముతో విద్యుత్ ఇవ్వడం మంచిదే. అయితే ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించగలగాలి. సౌరవిద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి ప్రాధాన్యం ఇస్తే తప్ప విద్యుత్‌రంగంలో పెద్దగా మార్పులేవీ ఊహించలేం.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

విపక్షాల వైఖరి సరికాదు

నూతన సచివాలయ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు వద్దనడం సరికాదు. అధునాతన సౌకర్యాలతో, అన్ని కార్యాలయాలు ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్రం ఆదాయంలోను, అభివృద్ధిలోను దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే విపక్షాలు ఓర్వలేక విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ వైఖరి సరికాదు.
-గుండమల్ల సతీష్‌కుమార్, హైదరాబాద్