ఉత్తరాయణం

రఘువీరా విమర్శలు హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్టశ్రాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నంద్యాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌ను కలసి రాష్ట్ర విభజన అంశంపై ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని, నంద్యాలలో పోటీ చేసి ఉండవలసిందికాదని, రాహుల్, సోనియా ప్రజలకు క్షమాపణ చెబితే బాగుంటుందని సూచించడంతో, డిగ్గీరాజా భగ్గుమన్నారని వినికిడి. ఆ తరువాత స్వరం మార్చిన రఘువీరా వైకాపా, తెదేపా అసలు రాజకీయ పార్టీలే కాదని, అవి భాజపా జేబు సంస్థలని విమర్శించడం విడ్డూరం. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబానికి జేబుసంస్థలా ఉంది. దీనికి ఆయన ఏమంటారోమరి!
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
ప్రాణాలు తీస్తున్న ఆట
ఎవరు సృష్టించారోకానీ భయంకరమైన బ్లూవేల్ ఆట అనె్నం పునె్నం ఎరుగని యువతీయువకుల ప్రాణాలు తీస్తున్నది. దుర్మార్గమైన పద్ధతుల్లో తమకుతాముగా ప్రాణాలు తీసుకునేలా చేసే ఈ ఆట స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ప్రాణాంతకంగా మారింది. స్మార్ట్ఫోన్లతో వచ్చిన పెనుముప్పు ఇది. బ్లూవేల్ వంటి ఆటలు, అసభ్య కార్యక్రమాలను అందించే సైట్లను నిషేధించేందుకు ప్రభుత్వం సాంకేతికంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
తెలుగుభాషకు పట్టంకట్టాలి
మాతృభాషకు పట్టంగట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలుగుభాషకు పూర్వవైభవం వచ్చే దిశలో తొలి అడుగు. ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరిగా బోధించాలన్న నిర్ణయం మేలు చేస్తుంది. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడి కోరిక కూడా అదే. తెలుగుభాషను పరిరక్షించుకోవాలన్న తపన ప్రజల్లోనూ స్వతహాగా రావాలి. స్వభాషపై మమకారం విషయంలో తమిళులను చూసి నేర్చుకోవలసినది ఉంది. ఆంగ్లభాషలోని పదాలు దొర్లకుండా చిత్రాలు నిర్మించేవారికి తమిళంలో ప్రోత్సాహకాలు ఉంటాయి. టీవీ యాంకర్లు, రచయితలు భాషను చంపేస్తున్నారు. ఉచ్చారణ దోషాలు, అర్థం తెలియకుండా రాసిన పదాలు వెగటుపుట్టిస్తున్నాయి.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్