ఉత్తరాయణం

కాంగ్రెస్‌కు అదే శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా సంస్థలు లేకపోవడం పెద్దలోపం. ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాల్లో పేరుమోసిన నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. ఒకప్పుడు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేయడం మొదలెట్టిన చంద్రబాబు ఎన్టీఆర్‌ను విమర్శించి ఆ తరువాత తెలుగుదేశంలో చేరినట్టే చాలామంది కాంగ్రెస్‌లో ఎదిగి ఆ తరువాత పార్టీలు మార్చేశారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చే ఇప్పుడు పార్టీలు మారిన నేతలు మళ్లీ ఇందులో చేరి సొంత గూటికి చేరామని గొప్పలు చెప్పుకోకమానరు. ఇది ఆత్మవంచనే.
-వై.సాంబశివుడు, గుంటూరు.
బస్సుల రంగు మారాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర ఏళ్లయింది. అయినా ఆర్టీసి బస్సుల రంగు మారలేదు. ఏపీలో పల్లెవెలుగు బస్సులను తెలుగువెలుగు గా మార్చి రంగులు మార్చారు. అలాగే తెలంగాణలో పల్లెవెలుగు, పల్లె తెలంగాణగా మార్చాలి. ఎరుపు రంగు వేస్తే మంచిది. ఇతర రాష్ట్రాల బస్సులకు భిన్నంగా మన బస్సుల రంగు ఉండాలి. అలాగే నవ్య క్యాట్ కార్డు పేరును కూడా మార్చాలి. ఆర్డినరి బస్సుల రంగులు మారిస్తే బాగుంటుంది.
-ఎస్.రవిప్రకాశరాజు, మునగాల
గోవులను కాపాడండి
చాలా పట్టణాల్లో గోసంరక్ష కేంద్రాలు, గోశాలలు ఉన్నా వాటి నిర్వహణలో లోపాలు ఉన్నాయి. పాలు ఇవ్వని గోవులను రోడ్లపైనే వదిలేస్తున్నారు. వాటికి ఆహారం దొరకక ప్లాస్టిక్ కవర్లను, పాలిథిన్ కవర్లను తింటున్నాయి. పాలిథిన్ కవర్లను నిషేధిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అమలులో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా పశువుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిధిన్ కవర్లను నిషేధించి మూగజీవాలను రక్షించాల్సిన అవసరం ఉంది.
-టి.సురేశ్‌కుమార్, శ్రీకాకుళం