ఉత్తరాయణం

‘కన్నా’తో ‘కమలం’ పాచిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో వికసించేందుకు, విస్తరించేందుకు ‘కమలం’ కృతనిశ్చయంతో ఉన్నట్టుంది. ఒక జాతీయ పార్టీకి ఆ ఆకాంక్ష సహజమే కానీ, వేగంలోనే ఉంది కీలకమంతా. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణని ప్రకటించి అందరినీ భాజపా ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కన్నా బిజెపిలో నాలుగేళ్ల క్రితం చేరినా, ఇంతవరకూ లోప్రొఫైల్‌లోనే ఉన్నారు. పైగా ఈమధ్యనే వైకాపాలోకి చేరుతున్నట్టు ప్రకటన చేసి చివరి నిమిషంలో ఆగిపోయారు. అధికార పార్టీపై చురుగ్గా విరుచుకుపడుతున్న నేతలుండగా, కన్నాకు పగ్గాలివ్వడం భాజపా దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. కర్నాటకలో మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తునే ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహరచన చేస్తుంది. ‘కమలం’ స్వయంప్రకాశితం కావడానికే ‘కన్నా’కు పార్టీ అధ్యక్షపదవిని కట్టబెట్టింది.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
అనైతిక రాజకీయాలు
కర్నాటకలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేస్తున్నాయి. ఏ పార్టీకీ మెజారిటీ రానందున అనైతిక రాజకీయాలకు తెరలేచింది. తమ కంటే తక్కువ సీట్లు గెలిచిన జేడీఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించడం అనైతికకు పరాకాష్ఠ. ఎన్నికల ముందు పరస్పరం తిట్టిపోసుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇలా చెలిమికి సిద్ధపడడం సిగ్గుచేటు. మెజారిటీ రాకున్నా, అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానించడం సబబే. అయితే, ఇతర పార్టీలను చీల్చకుండా ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో జరిగే బల నిరూపణలో ఎలా నెగ్గుతారు? డబ్బు, పదవులను ఎరవేసి కనీసం ఎనిమిది మంది విపక్ష ఎమ్మెల్యేలను లోబరచుకుంటే తప్ప బల నిరూపణలో ఆయన గెలవలేరు. ఇలా గెలవడం అనైతికం కాదా?
- కె.వౌనిక, విశాఖ