ఉత్తరాయణం

ఐటి ఉద్యోగులకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక వేతనాలు చెల్లించలేమని, నైపుణ్యం లేదన్న సాకుతో ఉద్యోగులను తొలగిస్తున్న వివిధ ఐటి కంపెనీలు కార్మిక చట్టాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఆ చట్టాల పరిథిలోకి రాకపోవడంతో ఐటీ సంస్థలు విర్రవీగుతున్నాయి. నిజానికి పెద్దజీతగాళ్లు అన్న పేరు ఐటీ రంగంలోని ఉద్యోగులను అంటున్నప్పటికీ విధి నిర్వహణలో వారిపై ఉండే ఒత్తిడి సాధారణంగా ఉండదు. అందుకే వారికి అంతంత జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. తీరా అమెరికా వంటి దేశాల్లో మారిన పరిస్థితుల్లో ఇక్కడ ఐటీ రంగం ఉద్యోగులను తొలగిస్తోంది. దీంతో వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. ఐటీ రంగంపై ఎనలేని ఆసక్తి చూపిస్తున్న యువతరానికి తాజా పరిణామాలు హెచ్చరికలాంటివే.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్

తమిళనాట కొత్త పార్టీలు?

తమిళ రాజకీయాల్లో కొత్తమార్పు వస్తున్నట్లుంది. కమల్-రజనీకాంత్ కలసి రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. జయలలిత మరణానంతరం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆమె నెచ్చెలి శశికళ కారాగారవాసంతో రాజకీయ మార్పులు మొదలయ్యాయి. పళని, పన్నీర్ వర్గాలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు శశికళ, దినకరన్ వేరే పార్టీ పెడతారా, లేక అన్నాడిఎంకె తమదే అని నిరూపించేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తారా? అన్నది ప్రశ్న. ఒకవేళ కొత్త పార్టీలు పుట్టుకొస్తే బిజెపి, కాంగ్రెస్‌లు లబ్దిపొందే అవకాశాలు ఎక్కువ.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

మూగజీవులను
కాపాడుకుందాం

మానవుడు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మూగజీవాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. అవి నివసించే ప్రాంతాలను అభివృద్ధి ఆక్రమిస్తుండటంతో నివాస ప్రాంతాలను కోల్పోతున్నాయి. ఇక వివిధ జంతువుల శరీర భాగాలను విక్రయించేందుకు వన్యప్రాణులను హతమారుస్తుండటం మరో సమస్య. అందుకే జంతువుల పరిరక్షణకోసం ఉద్యమించాలని నిర్ణయించారు. ఏటా అక్టోబర్ 4వ తేదీన జంతు సంక్షేమ దినంగా పాటిస్తున్నారు. మూగజీవాలను, వాటి జాతులను పరిరక్షించడం దీని లక్ష్యం. పశువులు, వన్యప్రాణులు, పెంపుడు జంతువులు, పక్షులను రక్షించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒకేతాటిపైకి రావాల్సి ఉంటుంది. ఆయా జీవులపట్ల జాలి,దయ,కరుణ చూపాల్సి ఉంది. పశుసంతతి సంక్షేమంతోనే మన ప్రగతి ఆధారపడి ఉంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట