ఉత్తరాయణం

ఉపాధ్యాయులకు హోదా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది. 1994లో యునెస్కో ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. స్టేటస్ ఆఫ్ ది టీచర్స్ సాధనకు ఇప్పటికీ ఉద్యమించవలసి వస్తోంది. మానవాభివృద్ధిలో ఉపాధ్యాయులది ప్రముఖ పాత్ర. బోధించేవారిని ఉపాధ్యాయులని అంటాం. కానీ విద్యాసంబధిత లక్ష్యాలు, ప్రయోజనాల నేపథ్యంలో విద్యా అవసరాల మేరకు ఉపాధ్యాయుల హోదా ఉనికిలోకి వస్తుంది. విద్యావిధానం నిర్ణయించడంలో వారిని భాగస్వాములను చేయాలి. విద్యారంగంలో కీలక పదవులను ఉపాధ్యాయవర్గాలవారికే ఇవ్వడం సముచితం. ఇవన్నీ యునెస్కో తీర్మానంలో ఉన్నవే. ఉపాధ్యాయ సంఘాలు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రజాప్రతినిధులుగా సేవ చేసే అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వాలి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించిన యునెస్కో ఆ తరువాత అది అమలు జరుగుతున్న తీరు, వైఫల్యాలు, ఇబ్బందులపై సమీక్ష నివేదికలను విడుదల చేయడం లేదు. ఒక సంస్థ విడుదలచేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ టీచర్ స్టేటస్ ఇండెక్స్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఉపాధ్యాయుల పనిభారం ప్రపంచంలో సగటున వారానికి 38 గంటలుగా ఉంది. దానినిబట్టి మన టీచర్ల పరిస్థితిని అంచనావేయొచ్చు.
-నాగటి నారాయణ, హైదరాబాద్

అలసత్వంవల్లే ప్రాణనష్టం

ఆమధ్య ముంబైలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం సంభవించడానికి ప్రభుత్వ, రైల్వేశాఖ అధికారుల అలసత్వమే కారణం. రెండుమూడు రోజుల క్రితం లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల సంఘటన మూర్ఖత్వం ఫలితం. ఈ రెండు దుర్ఘటనలను పూర్తిగా నివారించే అవకాశాలు ఉన్నా ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరి ముప్పునకు కారణమవుతోంది. ఇరుకైన పురాతన వంతెనపై లక్షలాదిమంది రోజూ వెళ్లివస్తున్న విషయం తెలియని అధికారులు ఉన్నారా? కొత్త వంతెనకోసం ఏర్పాట్లు ఏవీ? అటు అమెరికాలో ఒక వ్యక్తి విచ్చలవిడిగా మారణాయుధాలతో ఒక హోటల్ గదిలో కూర్చుని కాల్పులు జరిపగలిగితే భద్రతా వ్యవస్థను ఏమనుకోవాలి. రెండు ప్రజాస్వామ్య దేశాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రజాచైతన్యంతో ప్రభుత్వాలను అదలిస్తే తప్ప కదలిక రాదు.
-డి.వి.జి.శంకరరావు, పార్వతిపురం

భద్రతాబలగాలకు జేజేలు

కశ్మీర్‌లో సరిహద్దు భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టిన సైనికుల ధైర్యసాహసాలు స్ఫూర్తినిస్తున్నాయి. దేశాన్ని, జాతిని అనుక్షణం రక్షిస్తున్న జవానులకు జేజేలు చెప్పాలి. జైషే మహమ్మద్ వర్గం క్రూరమైన దాడిని తిప్పికొట్టి మన సత్తా చాటారు. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి సైనికాధికారి వీరమరణం పొందడం దేశం కోసం చేసిన త్యాగం. అందుకే సైనికులకు జాతి రుణపడి ఉండాలి.
-బి.ఎమ్.రెడ్డి, కర్నూలు