ఉత్తరాయణం

అమ్మభాషకు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమ్మభాషకు దక్కిన గౌరవంగా భావించాలి. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలన్న నిర్ణయంవల్ల ఎంతో మేలు జరుగుతుంది. మార్కులు, ఉద్యోగ అవకాశాల ఆశలతో తెలుగును కాదనుకుని ఇతర భాషలవైపు మొగ్గు చూపుతున్న విద్యార్థులు ఇక తెలుగును నేర్చుకోవలసి ఉంటుంది. నిజానికి ప్రజల్లో తమకు తాముగా మాతృభాషపై మమకారం పెంచుకోవలసిన సమయం ఇది.
-సరికొండ శ్రీనివాస రాజు, వనస్థలిపురం
బకాయిలు చెల్లించాలి
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం అమలులో కీలకపాత్ర పోషిస్తున్న ఏజెన్సీ గ్రూపులకు నెలల తరబడి చెల్లింపులు జరపడం లేదు. ఏజెన్సీల తరపున పనిచేస్తున్న కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూండటం, బకాయిలు పేరుకుపోతూండటంతో విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లోపిస్తోంది. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిపితే పెట్టుబడికి ఏజెన్సీలకు అవకాశం ఉంటుంది. ఎప్పుడొస్తాయో తెలీనప్పుడు వారు ఎక్కడి నుంచి సరుకులు తేగలరు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరిగితే అటు విద్యార్థులకు, ఇటు ఏజెనీలకు చెందిన కార్మికులకు కడుపు నిండుతుంది.
-కె.ఎస్.రెడ్డి, పరకాల
మద్యం దుకాణాలు వద్దు
మహనీయుల విగ్రహాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, జనావాసాలకు దగ్గరలో మద్యం దుకాణాలను అనుమతించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మంచి చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో త్వరలో కొత్త మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి.
-జి.ఎస్.కుమార్, సంస్థాన్ నారాయణపురం
తాజ్‌పై కినుక ఎందుకు?
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దర్శనీయ స్థలాల జాబితా నుంచి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తొలగించడం సరికాదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైఖరి అతడి చిన్నమనసును ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులు తాజ్‌ను చూడటానికి ఇష్టపడతారు. వారివల్ల వచ్చే ఆదాయంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. రాజకీయ కారణాల రీత్యా తాజ్‌ను దర్శనీయ స్థలాల జాబితా నుంచి తొలగించడం ద్వారా యోగి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నదో తెలియడం లేదు.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం