ఉత్తరాయణం

ఆర్భాటం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం పేరిట జరుగుతున్న ఆర్భాటానికి అర్థం లేదు. రెండేళ్ల నుంచి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు వచ్చివెళ్లడం, ప్రతిపాదనలు, ప్లాన్‌లు అందచేయడం, మళ్లీ కొత్త బృందాలకు పని అప్పగించడం వంటి పనులవల్ల ఎంతో ఖర్చు అవుతోంది. ఖజానాలో నిధులు లేవంటున్న ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ సినీ దర్శకుడు రాజవౌళితో చర్చలు జరపడం ఎందుకు? ఆయనను విమానంలో రప్పించడం ఎందుకు? రాజకీయ పదవుల్లో ఉన్నవారు వచ్చివెళ్లినపుడు భారీ సన్మానాలవల్ల ఖర్చు తడిపిమోపెడవుతోంది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
సీజనల్ వ్యాధులతో సమస్యలు
హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పారిశుద్ధ్యం సరిగా నిర్వహించకపోవడం, జల కాలుష్యం దీనికి కారణం. డెంగ్యూ, వైరల్ జ్వరాలతో పెద్దఎత్తున ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రోజూ వచ్చే రోగుల సంఖ్య వేలకు చేరుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
-ఎస్.ఎస్.రాజు, వనస్థలిపురం
ఫలితాన్నిచ్చే చర్య
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయని గట్టిగా చెప్పొచ్చు. పబ్లిక్ పార్కులు, పర్యాటక ప్రాంతాలు, కార్యాలయాల సమీపంలో ద్రోన్‌ల సహాయంతో దృశ్యాలను చిత్రీకరించే సాంకేతికతను వినియోగించాలన్న కరీంనగర్ పోలీసుల నిర్ణయంతో అల్లరిమూకలకు చెక్ చెప్పడం ఖాయం. ఈవ్‌టీజింగ్ నిరోధానికి ఇది ఉపకరించే పరిణామం.
-బి.మధుసూదన్‌రెడ్డి, కర్నూలు
ఆందోళన కుట్రపూరితం
బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఇటీవల జరిగిన ఆందోళనల వెనుక వామపక్షవాదుల కుట్ర ఉంది. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన మదన్‌మోహనమాళవీయ విగ్రహానికి నల్లరంగు పూసి, మాంసాహారం కోసం వామపక్ష విద్యార్థినీవిద్యార్థులు ఆందోళనకు దిగడం వెనుక రాజకీయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న రాజకీయ పక్షాలు తమ వైఖరిని మార్చుకోవాలి. చదువుకునేందుకువచ్చిన వారు మాంసాహారం కోసం పట్టుబట్టడం, తీవ్ర ఆందోళనలు చేయడంలో అర్ధం లేదు.
-వేముల జనార్దన రావు, వంకావారిగూడెం