ఉత్తరాయణం

దేశం ముఖ్యమా... అధికారం ముఖ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశములోని ప్రతిపక్ష ఐక్యకూటమి కేవలం అధికారం కోసమే గాని, దేశ భవిష్యత్తుకు మాత్రం గాదనేది నూటికి నూరు శాతము వాస్తవము. దేశంకోసం నిరంతరం శ్రమించే భారతీయ జనతాపార్టీని గద్దె దించాలనే మహాకూటమి దేశానికి కీడు తలపెట్టినదనేది నిజము. ఈ దేశము ఐక్యంగా వుండటము వారికి ఇష్టంలేదు. ప్రతి రాజకీయ వేత్తకు అధికారము కావాలి, ఆ తర్వాత సంపాయించుకోవాలి. రాజకీయ నాయకుల ఆస్తులు ఎలా పెరిగిపోయాయో విచారణ చేస్తే బయట పడతాయి. దేశంలో వంద ఇరవై కోట్ల ప్రజలుంటే కేవలం దేశంలో ఒకే కుటుంబమే దేశాన్ని ఏలాలా? ఇదా ప్రజాస్వామ్యము? లేక ఇది రాజరికమా? ఎందుకు ఒకే కుటుంబానికి బానిసలౌతున్నారు. ఇది దేశ ప్రజలు కూడా గుర్తించాలి. రాజకీయ నాయకులకు బానిసలు కాకూడదు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి దేశ భవిష్యత్తును గూర్చి ఆలోచించాలేగాని, రాజకీయవేత్తల భవిష్యత్తును గాదు. దేశాన్ని రక్షించుకోవాలంటే, కుటుంబ రాజకీయ సేవ మానండి.
- జి. శ్రీనివాసులు,
అనంతపురం