ఉత్తరాయణం

ఒత్తిళ్లకు విద్యార్థులు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర్యాంకులు, మార్కులు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తున్నందున నేడు పలు విపరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. బతకడం కోసం, విజ్ఞానం కోసం ఉపయోగపడాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని కోట పట్టణంలో ముగ్గురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. చదువులో ఒత్తిడికి లోనై వీరు బలవన్మరణాలకు పాల్పడి ప్రాణాలు విడిచారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. రాజస్థాన్‌లోని కోట పట్టణం ఐఐటీ-జేఈఈ కోచింగ్ సెంటర్లకు నిలయంగా మారింది. దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు జేఈఈ కోచింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎంట్రెన్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న జీతేశ్‌గుప్తా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. బిహార్‌లోని సివా జిల్లాకు చెందిన ఈ యువకుడి వయసు 19 ఏళ్లు. మరో కోచింగ్ సెంటర్‌లో ‘నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల దీక్షాసింగ్, 16 ఏళ్ల దీపక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎంట్రన్స్‌లలో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయడమే ఈ అనర్థాలకు కారణం. హోమ్ వర్క్, స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్, వీక్లీ టెస్ట్.. ఇలా కోచింగ్ సెంటర్లలో క్షణం తీరికలేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కోచింగ్ సెంటర్లు ఆంక్షలు విధించడం సర్వసాధారణమైంది. విద్యార్థుల ఇష్టాయిష్టాలు, వారి శక్తిసామర్థ్యాలతో సంబంధం లేకుండా ఒత్తిడి పెంచుతున్నారు. టాప్ ర్యాంకులు, మార్కులు రాకపోతే ఇంక దేనికీ పనికిరారన్న అభద్రతా భావాన్ని విద్యార్థుల్లో పెంచుతున్నారు. ఈ టెన్షన్ వాతావరణాన్ని తట్టుకోలేక ఏటా దేశవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఐఐటీ కోచింగ్ కేంద్రాల్లో, ప్రఖ్యాత విద్యాసంస్థలలో ఇదే జరుగుతోంది.