ఉత్తరాయణం

జీతాల పెంపు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకన్నా ఎక్కువగా జీతాలు ఇస్తామని, కానీ ఓపికపట్టాలని దసరా సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, ఉద్యోగ సంఘాలు తమ కోర్కెల చిట్టా విప్పడం చూశాము. నిజానికి కొత్తరాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. ఉద్యోగులకు జీతాలు పెంచడం తప్పుకాదు. కానీ అమాంతం, భారీ మొత్తంలో పెంచాల్సిన అవసరమేమిటి? నిరుద్యోగులు, ఒప్పంద కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో పథకాలు నిధులు లేక అమలు కావడం లేదు.
-సత్తి రమాసత్యవతి, ధవళేశ్వరం
ఇఎస్‌ఐ సేవలపై ప్రచారం
కరీంనగర్ జిల్లా రామగుండంలో కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యాలయం ద్వారా అందే ప్రయోజనాల గురించి కార్మిక వర్గాలకు సరైన అవగాహన లేదు. కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తూ క్షేత్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ఈఎస్‌ఐ సేవలు సద్వినియోగం అవుతాయి.
-సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట
గంగానది ప్రక్షాళన అవసరం
కాశీ వెళ్లినవారు విశే్వశ్వరు దర్శనం తో ఎంత పుణ్యం పొందుతున్నారో కాని అక్కడి పరిస్థితులను చూసినా, గంగానది కాలుష్యాన్ని చూసినా మళ్లీ వెళ్లాలనిపించదు. ఆలయానికి వెళ్లే ఇరుకైన రహదారి, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, రద్దీ విసుగుతెప్పిస్తాయి. గంగానదిలో సగం కాలిన శవాలు దర్శనమిస్తాయి. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు నదిలో కలుస్తూంటాయి. అందుకే అక్కడి సాధువులు, సన్యాసులు గంగాస్నానం మానుకున్నారని చెబుతారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గంగానది ప్రక్షాళన చురుకుగా, సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
పర్యావరణానికి చేటు
దీపావళి పండుగ సందర్భంగా పర్యావరణానికి హాని తలపెట్టకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పెద్దగా నష్టం కలిగించని బాణాసంచా కాల్చడంలో తప్పులేదు. కానీ పర్యావరణాన్ని దెబ్బతీసే విషరసాయనాలతో తయారు చేసిన వస్తువులను, చైనావంటి దేశాలు ఉత్పత్తి చేసిన నాణ్యత లేని బాణసంచా కాలిస్తే కాలుష్యం పెరిగిపోతుంది. ఒక ఏడాదిలో జరిగే కాలుష్యం ఒక్క దీపావళి రోజునే ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన బాణసంచా వినియోగం మేలు. పెద్దశబ్దం రాని వాటిని వినియోగించాలి.
-జి.అశోక్, మెట్‌పల్లి