ఉత్తరాయణం

ఆర్టీసి బస్టాండ్లలో అపరిశుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ఆర్టీసి బస్టాండ్లు అపరిశుభ్రతతో ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు వేచి ఉండవలసిన ప్రాంగణాలు సరిగ్గా లేవు. ఎక్కడపడితే అక్కడ చెత్త ఉన్నా తొలగించడం లేదు. ప్రయాణికుల వైఖరి కూడా ఇందుకు కారణం. మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. ప్రాంగణాలలో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడంతో దుర్గంధంవల్ల అసౌకర్యంగా ఉంటోంది.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
మాల వర్గానికి అవకాశం ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సిల అభివృద్ధికోసం తక్షణం కమిషన్‌ను వేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దళితుల సంక్షేమాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదు. షెడ్యూల్డు కులాలకు చెందినవారు అభివృద్ధి చెందకుండా తెలంగాణ బంగారు తెలంగాణగా మారదు. ఎస్‌సి కమిషన్ చైర్మన్‌గా మాదిగ వర్గానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మిగతా సభ్యులను మాల వర్గం నుంచి ఎంపిక చేయాలి. అప్పుడే దళితులలో ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది.
-గుండమల్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం
బ్యాంకుల్లో కష్టాలు
పొదుపు ఖాతాలో డబ్బులు చేయడానికి బ్యాంకులకు వెళ్లే వినియోగదారులు కొన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అందరికీ ఆ పరిజ్ఞానం ఉండదు. డెబిట్‌కార్డు లేదా ఎటిఎమ్ కార్డు ద్వారా లేదా డిపాజిట్ మిషన్ ద్వారా జమ చేయాలని చెబుతున్నారు. ఓచర్‌పై జమ చేసే వెసులుబాటును కల్పించడం లేదు. ఇది కొందరికి ఇబ్బందికరంగా మారింది. వినియోగదారునికి అవగాహన కల్పించడం లేదా బ్యాంకుల్లో సహాయకులను అందుబాటులో ఉంచడం అవసరం.
-ఎ.ఆర్.ఆర్, ఖమ్మం
పెట్రో ధరల భారం
పెట్రోల్, డీజిల్ ధరలను ఏరోజుకు ఆరోజు నిర్ణయించే విధానం వినియోగదారులకు భారం మోపుతోంది. రోజూ లీటర్‌పై ఐదు పైసలు మొదలు పది పైసలు వరకు పెంచేస్తున్నారు. ఎంతమొత్తం పెరిగిందో అర్థంకాని స్థితిలో తెలియకుండానే వినియోగదారుడి జేబులు ఖాళీ అవుతున్నాయి. సగటున గడచిన రెండు నెలల కాలంలో లీటరుపై పది రూపాయల వరకు భారం పడింది. ఈ ఏడాది జూన్ 16 నాటికి లీటర్ పెట్రోల్ 65 రూపాయలు ఉంటే ఇప్పుడు 75 రూపాయలకు పెరిగింది. ఇది కరీంనగర్ జిల్లాలో పరిస్థితి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా ఇక్కడ ఆ ప్రభావం లేకపోవడానికి కారణం ఏమిటి?
-గుండు రమణయ్య, పెద్దపల్లి