ఉత్తరాయణం

రాజస్థాన్ వైఖరి సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అధికార గణానికి ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లుంది. ఆ మేరకు హక్కుకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని భావించినట్లుంది. ఇంతవరకూ ఆర్డినెన్స్ రూపంలో ఉండి, ఇప్పుడు రాజస్థాన్ శాసనసభలో బిల్లుగా ప్రవేశపెట్టబడిన చట్టం తీరుతెన్నులు చూస్తే కరడుగట్టిన నియంతలైనా ఆ బరితెగింపునకు విస్తుపోతారు. ఆ చట్టం ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు వారు మాజీలైనప్పటికీ ఒక ప్రభుత్వ రక్షణ ఛత్రం ఉంటుంది. వారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు బలమైన సాక్ష్యాధారాలతో ఉన్నా ప్రభుత్వ అనుమతి లేనిదే ఈగ వాలడానికి లేదు. పైగా వారి వివరాలు ప్రచురిస్తే, అలా అవినీతిని వెలికి తీయడానికి ప్రయత్నించిన వాళ్లకి రెండేళ్ల ఖైదు. వారి విషయమై ఓ ఆరునెలలు వేచి చూస్తే ప్రభుత్వమే ఏదో ఒకటి తేల్చి చెబుతుందటడ. ఇది అవినీతిపరుల దృష్టిలో సరైన చట్టమే కావచ్చునేమోకానీ ఇంటి యజమాని అనుకున్నవాడు చేయవలినది కాదు. నియంతలు తాము చేయడానికే జంకే ఇలాంటి చట్టాల్ని ప్రజాప్రభుత్వాలు చేసిపారెయ్యడం మన దౌర్భాగ్యం. ఇలాంటి చీకటి చట్టాల్ని తలపోస్తున్నందుకు పౌరసమాజం, ప్రతిపక్షాలే కాదు ప్రధాని కూడా అక్కడి తమ పార్టీకి చెందిన ప్రభుత్వాన్ని తలంటాలి.

-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం