ఉత్తరాయణం

తల్లిదండ్రుల ధోరణి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇష్టం లేకపోయినా కార్పొరేట్ విద్యాసంస్థల్లోను, హాస్టళ్లలోను పిల్లల్ని చేర్పించి, నచ్చని కోర్సులను రుద్దడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇంగ్లీషు మీడియం, కార్పొరేట్ విద్యపై మోజు, పెద్దవాళ్లయ్యాక తమ పిల్లలు బాగా సంపాదించాలన్న అత్యాశ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ వారి శక్తిసామర్థ్యాలు, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. విద్యార్థినీ విద్యార్థుల సమర్ధతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఫీజులు దండుకునేందుకు కార్ఖానాల్లాంటి గదుల్లో విద్యార్థులను పెట్టి ఒత్తిడి చేసి చదివించడం, తగిన ఫలితాలు సాధించని పిల్లలు బలవన్మరణాలకు పాల్పడం జరుగుతోంది. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ విద్యాబోధన జరుగుతోంది. అబ్దుల్ కలామ్ వంటి వారు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఎదిగారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తే పిల్లలను కాపాడినవారవుతారు.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నరసరావుపేట
మైనారిటీల ఆస్తులకు రక్షణ
ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మైనారిటీల ఆస్తుల పరిరక్షణ నిమిత్తం ప్రభుత్వం వారు మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఎస్‌సి, ఎస్‌సి క్రిస్టియన్ సంక్షేమ సంఘం ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుంది. రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. చాలామటకు ఆక్రమణలకు గురయ్యాయి. కబ్జా చెర నుండి ఆయా ఆస్తులను రక్షించి క్రైస్తవ సంస్థలకు అప్పగించడానికి మంత్రుల బృందం చర్యలు తీసుకోవాలి.
-మందపల్లి సత్యం, రామచంద్రాపురం