ఉత్తరాయణం

ప్రజలను రెచ్చగొట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒక ఇంగ్లీషు ఛానల్‌లో పాత్రికేయుడు ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలు, కార్యక్రమం ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉంది. హిందు సంప్రదాయాలపై దాడిగా పేర్కొనడం భావ్యం కాదు. ఢిల్లీలో జీవించడానికి అనువైన వాతావరణం కోసమే ఆ సూచనగా పరిగణించాలి. గతంలో ఢిల్లీలో కాలుష్యానికి కారణమైన డీజిల్ కార్లు, కాలం తీరిన వాహనాల వాడకంపై సుప్రీం తీర్పు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.
-నయనాల సూర్యప్రకాశరావు, కాకినాడ
అర్చకులుగా దళితులు
కేరళలోని పురాతన మానాపురం శివాలయంలో దళిత యువకుడిని ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నం సమీపంలోని ఉప్పలూరులోని అతి ప్రాచీన చెన్నకేశవస్వామి దేవాలయంలో 16వ శతాబ్ది మధ్య కాలం నుంచి దళితులు అర్చకులుగా ఉంటున్నారు. ఇది గర్వకారణం. ఈ ఆలయంలో అగ్రవర్ణాలవారు కూడా అర్చకులకు పాదాభివందనం చేస్తున్నారు. జాతిపిత గాంధీజీ కూడా ఆ ఆలయంలో దళితజనోద్ధరణ చూసేందుకు రావాలని భావించారని చెబుతారు. కవి, పరిశోధకులు గంధం నాగేశ్వరరావు ఈ ఆలయంపై సాధికారిక గ్రంధం రచించారు.
-బండి సరోజిని, అత్తిలి
భగీరథ పనుల నత్తనడక
నల్గొండ జిల్లాలో ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెయిన్ పైప్‌లైన్ గ్రిడ్ పనులు ఈ డిసెంబర్‌లోగాను, ఓవర్‌హెడ్ ట్యాంకుల పనులు వచ్చే జూన్‌లోగాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. అయితే పైప్‌పైన్ల పనుల్లో 50 శాతం కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకుల పనులకు ఇంకా టెండర్లు పిలవలేదు. ఈ పరిస్థితుల్లో భగీరథ పనులు సకాలంలో పూర్తవుతాయా అన్నది సందేహంగా ఉంది. ఫ్లోరైడ్ సమస్యతో విషపూరితంగా మారిన జలాలతోనే నెట్టుకొస్తున్న ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన పథకంతో ఆశలు రేగాయి. కానీ తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-సి.హెచ్.సాయిఋత్విక్, నల్గొండ
ఆత్మహత్యలు ఆందోళనకరం
విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. అవి రాజకీయ రంగులు పులుముకోవడం మరింత బాధాకరం. ఆత్మహత్యలకు ఇతర కారణాలు ఎన్ని ఉన్నా ప్రధానంగా రెండు విషయాలను ఒప్పుకోవాలి. నాన్ డిటెన్షన్ విధానం, ఫీజు తిరిగి చెల్లించే విధానంవల్ల సమర్ధత లేకపోయినా పెద్దపెద్ద విద్యాసంస్థల్లో చేరుతున్నారు. అలా చేరడం తప్పుకాదు. కానీ గట్టి పరీక్షలు, కఠిన పరిస్థితులు ఎదురయ్యేసరికి బేలగా మారిపోతున్నారు. ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు ఇలా కాకుండా చూడాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి.
-పి.శాండిల్య, కాకినాడ