ఉత్తరాయణం

రిజర్వేషన్లపై సమీక్ష అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ రిజర్వేషన్ల పరిధిలోకి రానివారు ఈ విధానం వల్ల నష్టపోతున్నారు. రిజర్వేషన్లు పొందుతున్నవారిలో సంపన్నులూ ఉన్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతిభగల వారికి అన్యాయం జరగని విధంగా రిజర్వేషన్ల వ్యవస్థ ఉండాలి. ఒబిసి రిజర్వేషన్లలోని లోపాలను జస్టిస్ రోహిణి కమిషన్ సవరించాలి. బిసిల్లోని కొన్ని కులాల వారు తమను ఎస్‌టి జాబితాలోకి చేర్చాలని కోరుతున్నారు. వాస్తవాలను పరిశీలించి కమిషన్ సూచనలు చేయాలి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల విధానంలో సమూల మార్పులు, సంస్కరణలు తీసుకురావలసిన సమయం ఇది.
-జి.అశోక్, గోధూర్
స్వచ్ఛ్భారత్ స్ఫూర్తి
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కాకరాపల్లిల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన సమస్యలు కొందరు యువకుల కారణంగా పరిష్కారమవుతున్నాయి. కేంద్రప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం వారికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రగతి యూత్ అసోసియేషన్ పేరిట ఒక్కటైన యువకులు శ్రమదానం చేసి పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. చెత్త తొలగించారు. వీధులు శుభ్రం చేశారు.
-టి.సురేశ్‌కుమార్, మందరాడ
వివాదాలు వద్దు
తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ జీవితచరిత్రపై ఇద్దరు దర్శకులు రెండు సినిమాలు తీసేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. ఆయన జీవిత చరిత్రను ఎవరు తీసినా సన్నివేశాలు, సంభాషణలు, కథ తప్పనిసరిగా వివాదాలు రేపే అవకాసం ఉంది. ఎవరూ చూడని పురాణ పురుషుల పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారు. అలాంటి నటుడి పాత్రకు న్యాయం చేసే మరో నటుడు ఎక్కడున్నాడు. ఎవరు పోషించినా హాస్యాస్పదంగానే ఉంటుంది. పోటీగా కాకుండా ఆయనపై ప్రేమతో చిత్తశుద్ధితో ఒక చిత్రమే తీస్తే చాలు. నిర్మాతల్లో ఒకరైనా వెనక్కుతగ్గడం మేలు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్