ఉత్తరాయణం

నిరుద్యోగులపై సమ్మెట దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అత్యున్నత చదువులు చదివి కనీసం నాలుగో తరగతి ఉపాథి లేక కోట్లాది మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు భారమై ఉద్యోగ నియామకానికి గరిష్ఠ వయసు దాటి సతమత వౌతున్న వారెందరో ఉన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనులు చేయించటంతో సంబంధిత అధికారి, ప్రజా ప్రతినిధుల సంబంధీకులనే ఆ ఖాళీలు వరిస్తున్నాయి. అత్యధిక మందికి, ఉన్నత ర్యాంకులు సాధించిన వారికి సర్కారీ కొలువు ఎండమావే అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైల్వే బోర్డు పదవీ విరమణ (60) చేసిన పిదప మరో రెండేళ్లు ఉద్యోగం చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయటం నిరుద్యోగులపై సమ్మెట దెబ్బకు ఉపక్రమించినట్లయింది. ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల కడుపు నింపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఎన్టీఆర్ మీద సినిమా తీయాల్సిందే!
నటులు మరియు ముఖ్యమంత్రిగా చేసిన కీర్తిశేషులు తారక రామారావు గారి మీద వర్మ గాని, తేజ గాని లేదా మరెవరైనా సినిమాలు తీస్తే కచ్చితంగా ఆహ్వానించవలసిందే.
చాలామంది పౌరాణిక, చారిత్రాత్మక మరియు నాయకుల సినిమాలు తీసినప్పుడు లేని అభ్యంతరం ప్రస్తుతం కూడా ఉండకూడదు. ‘మండలాధీశుడు’ లాంటి రాజకీయ సినిమాలు తీసినప్పుడు ఎవరూ అభ్యంతర పెట్టలేదు. ప్రస్తుతం ‘మహానటి’ పేరుతో నటి సావిత్రి గారిపై సినిమా తీస్తుంటే ఆమె కూతురు సైతం అభ్యంతరపెట్టడం లేదు. అభ్యంతర పెట్టడమంటే రామారావుగారి తెర వెనుక చరిత్ర బయటకు వస్తుందని భయపడటమే.
-బి.వి.కోటేశ్వరరావు, వౌలాలి