ఉత్తరాయణం

రాజకీయులు దూరంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులను రుణ విముక్తులను చేయాలనే సదుద్దేశంతో 1904లో స్థాపించిన సహకార సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుట గమనార్హం. ముఖ్యంగా రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రాబల్యం కోసం వాడుకొంటున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రతి రాజకీయ నేత సహకార సంస్థల ఆసరాతోనే ఉన్నత రాజకీయ పదవుల నలంకరించారనుట అతిశయోక్తి కాదు. కనుక రాజకీయులను ఈ సంస్థలకు దూరంగా ఉంచటం మంచిది. కనుక రాజకీయాలకు అతీత శక్తులను సంస్థల అధిపతులు ఎన్నుకొనే దిశగా ప్రజా చైతన్యం రావాలి.
-కొలుసు శోభనాచలం, గరికపర్రు

విద్యార్థుల కోసం ప్రదర్శించాలి

నవంబర్ 8 నుండి 14 వరకు హైదరాబాద్‌లో బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించబోతున్నారు. అయితే చాలా ఏళ్ల క్రితం బాలల మానసిక వికాసానికి ఉపయోగపడే సినిమాలను ప్రత్యేకంగా పిల్లల కోసం నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా తక్కువ రేట్లకే ప్రదర్శించేవారు. కొన్నిసార్లు ఆరు బయట తెరలు ఏర్పరచి ఉచితంగా కూడా ప్రదర్శించారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఆ పద్ధతిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. పిల్లల సినిమాలు అతి తక్కువగా వస్తున్న తరుణంలో ఉత్తమ విదేశీ బాలల చిత్రాలను తెలుగులోకి అనువాదం చేయాలి. అలాంటి మూవీలను, అవార్డులు గెలుచుకున్న చిత్రాలను టీవీలో ప్రసారం చేయడానికి చర్యలు తీసుకోవాలి. విజ్ఞానం, దేశభక్తి, క్రమశిక్షణ, ధైర్యసాహసాలు ఇతివృత్తాలుగా గల బాలల సినిమాలను థియేటర్ ఉన్న ప్రతి పట్టణంలో నవంబర్ 8 నుండి 14 వరకు వారోత్సవాలుగా పాఠశాల విద్యార్థుల కోసం ప్రదర్శించాలి.
-గూరుడు అశోక్, గోదూర్

కూర‘గాయాలు’

రైతు బజార్లలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఆకు కూరలు, కాయగూరలు అనేకం విపరీతంగా ధరలు పెరిగాయి. ఈ ధరాఘాతంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇక నిరుపేదల పరిస్థితి ఏమిటి? రైతుబజార్లలోనే ఇలా ఉంటే బయట కూరగాయల ధరలు ఎంత హెచ్చుగా ఉన్నాయో చెప్పనలవి కాదు. అధికారులు జోక్యం చేసుకొని కూరగాయల ధరలను అదుపులోకి తేవాలి.

-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం