ఉత్తరాయణం

ఎలా నివారించాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడం కోసం టపాసులు కాల్చడాన్ని నిషేధించారు. దీనికన్నా ముందుగా 363 రోజులు కాలుష్యాన్ని వెదజల్లే కారణాలను అనే్వషించాలి. అర్బనీకరణ కూడా ఒక కారణం. సంప్రదాయక గ్రంథాల ప్రకారం ఈ కాలుష్యాన్ని ఎలా నివారించాలి? ఆలోచించి చర్చించాల్సిన విషయం. ధన త్రయోదశి నుండి కార్తీక మాసం పూర్తయ్యేవరకు ప్రతి ఇంట స్వచ్ఛమైన ఆవునేతితో ఎన్ని దీపాలు వీలయితే అన్ని వెలిగించాలి.అదే విధంగా అమెరికాకు చెందిన నాసా సంస్థ పరిశోధించి కాలుష్య నివారణకు తెలిపిన మొక్కలను దేశవ్యాప్తంగా పెద్దఎత్తున పెంచి కాలుష్యాన్ని నివారించవచ్చు.
-డి.ఎస్.జగదీశ్వర్, నెల్లూరు
చిత్తశుద్ధి
ఒకే దేశం ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం అనే స్లోగన్‌తో పుట్టి పెరిగిన జన సంఘం/ బిజెపి కేవలం మెహబూబా మెహర్బానీ కోసం 370 అధికరణ రద్దుచేసే వ్యవహారం అటక మీద పెట్టింది. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ గారి జమానా నుంచి మోదీగారు గద్దె నెక్కేదాకా ‘మనకి బలం సరిపోతే 370 పీకిస్తాం’ అని మన జాతీయవాదులు కలలు కన్నారు. పండిట్ల గోల పక్కన పెట్టి రోహింగ్యాలని ఓటర్ల లిస్టులో ఎక్కించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే లోగడ చైనా టిబెట్‌ని కబ్జా చేశాక, తిరుగుబాటు రాకుండా ఉండేందుకు ‘హాన్’ జాతి చైనీయులని వేల సంఖ్యలో ప్రతి ఏడాది టిబెట్ పంపి వాళ్లకి స్థలాలు ఇచ్చి చైనా భాష స్కూళ్లు పెట్టి డెమో మార్చేసింది.
-యశ్వంతరావు
శేషగిరిరావు, రాజమండ్రి