ఉత్తరాయణం

సుప్రీంకోర్టు తీర్పు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాన్రాను సుప్రీంకోర్టు తీర్పులు తికమకపెడుతున్నాయి. గతంలో ఇచ్చిన తీర్పులను వారే తప్పుపడుతున్నారు. పదహారేళ్ల పెళ్లైన అమ్మాయిని స్వయంగా భర్త కలిసినప్పుడు వేసిన కేసులో దాన్ని అత్యాచారం కింద నమోదు చేయనవసరం లేదని తీర్పు ఇవ్వగా, ఇప్పుడు అదే మైనర్ భార్యతో కలిస్తే అత్యాచారం కింద శిక్ష వేయవచ్చని సెలవిచ్చింది. ఈ తీర్పు సమాజంలో సంచలనం సృష్టిస్తోంది. ఆడవారి వయసు పద్దెనిమిది, మగవారి వయసు ఇరవై ఒకటి దాటాలని.. అప్పుడే వివాహం వయసు వస్తుందని చట్టం ఉండనే ఉంది. ఈ వయసు లోపల వివాహమయితే చెల్లదని చెప్పాలి గాని, భర్త మీద అత్యాచార నేరం మోపడం ఆచార విరుద్ధం. పూర్వం కొన్ని సంప్రదాయ కుటుంబాలలో ఆడపిల్లలకు రజస్వల ముందే వివాహాలు చేసి, ఆ తరువాత కాపురానికి పంపేవారు. కోర్టులు ఇచ్చిన తీర్పులు ఇలా తారుమారు కావడం అనేకసార్లు జరిగింది. అసలు రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ ఏ ప్రమాణాల మీద నిలబడిందో సుప్రీంకోర్టు గోలఖ్‌నాథ్, కేశవానంద భారతి, యింకా ఇతర కేసులలో రకరకాలుగా చెప్పింది. ఏమిటో ఈ కన్‌ఫ్యూజన్?
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
రంగుల గోల ఏల?
బస్సులకు ఎర్రరంగే ఉండాలి అనడం సరికాదు. నిజానికి ఎరుపు ఉద్రేకానికి సంకేతం. ఎండాకాలం మరింత మంటలు రేపుతుంది. ‘పల్లె వెలుగు’ అనే అందమైన పేరే కదా. అవి మన పల్లెలకే వెళుతున్నాయి గదా! అలాంటపుడు మనసు పాడు చేసుకోవడం ఎందుకు? అసలు ఈ రంగుల గోల ఏల? మార్పు చేయాల్సి వస్తే లక్షల డబ్బు వృథా అవుతుంది. ఆ డబ్బుతో ఏవైనా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుంది.
-కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్