ఉత్తరాయణం

ఆ ఒక్క రాష్ట్రానికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో జరిగిన కోటి దీపోత్సవంలో మాట్లాడుతూ తెలంగాణ ఎం.పి. కవిత ‘ఈ దీపోత్సవం వల్ల తెలంగాణ ప్రజలందరికీ సుఖం కలగాలి’ అని అనటం జరిగింది. మరి, తెలంగాణ ప్రజలు ఒక్కరే సుఖంగా ఉంటే దేశమంతా సుఖంగా ఉంటుందా?... ‘నా తెలంగాణ’ అని కె.సి.ఆర్., ‘నా అమరావతి’ అని చంద్రబాబు అదే పనిగా అంటూంటారు. అంటే వీరందరికీ తమ స్వంత బాగోగులు తప్ప దేశ క్షేమం గురించీ, దేశ సుభిక్షం గురించీ ఏమీ అక్కర్లేదన్న మాట?... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్య కేరళ వెళ్లి ఇలా అన్నారు. ‘లవ్ జీహాద్ అన్నది దేశానికి పట్టుకున్న పీడ. కేరళ ప్రభుత్వం దీన్ని నిషేధిస్తూ వెంటనే చట్టం చెయ్యాలి’. ఎందుకంటే ఆడపిల్లలు మాయమైపోతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటగా ఉంది గనక. దేశ శ్రేయస్సు యూ.పి. ముఖ్యమంత్రికి ఉన్నట్లుగా తెలుగు రాష్ట్రాల నాయకులకు ఎందుకు ఉండట్లేదో అర్థం కావట్లేదు.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
తప్పుకుంటున్నాయి..
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాగా పరిగణింపబడి 2019 సం.కల్లా పూర్తి కావాలి. కాని కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో నామమాత్రంగా వంద కోట్లు మాత్రమే కేటాయించింది. తర్వాత అడపాదడపా కాస్తకాస్త నిధులను విడుదల చేసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై కేంద్రం పూర్తిగా ఉదాసీనంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చినా తగిన నిధులు కేటాయించక పోవడం వలన ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని వున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగోలా వీటికి నిధులు సమకూర్చుకుంటూ భారంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నా కేంద్రం నిర్లిప్త వైఖరి ప్రదర్శిస్తోంది. 300 టిఎంసిలతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు, కృష్ణానదికి తరలించడమే కాకుండా, ఆమేరకు శ్రీశైలం నుండి రాయలసీమలోని కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించడానికి వీలుకల్పించే మహత్తర పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు కేంద్రం తన వంతు నిధులు సత్వరమే కేటాయించాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం