ఉత్తరాయణం

ప్రక్షాళన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని వివిధ చట్టసభల్లో కొలువై ఉన్న 1581 నేరారోపిత నాయకుల సంగతి ఎంతవరకు వచ్చిందన్నది కేంద్రానికి సుప్రీంకోర్టు వేసిన సూటి ప్రశ్న. మెజారిటీ కేసులు దర్యాప్తు స్థాయిలోనో, విచారణలోనే నత్తనడకగా నడుస్తూ ఉంటాయన్నది వాస్తవం. అయితే ఆరు వారాల్లోగా చట్టసభల సభ్యులకు సంబంధించిన నేరాలు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే విషయమై కేంద్రం నిర్దిష్ట ప్రణాళికతో తమ ముందుకు రావాలని న్యాయస్థానం ఆదేశించడం మేలిమలుపు. సమర్ధవంతమైన దర్యాప్తు, వేగవంతమైన విచారణ, శిక్ష అమలు అన్నవి లేకుండాపోవడం పరపతి ఉన్న నేరగాళ్లకు నెత్తిపైన పాలుపోస్తున్నాయి. అదే అవకాశంగా నేతలు అధికారం మరింత పెంచుకుని, మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్ల ద్వారా 1581 మంది క్రిమినల్ కేసులు ఉన్నవారు ఎన్నికయ్యారని తేలింది. ఇక బరిలో నిలిచిన నేరగాళ్ల సంఖ్యను ఎవరు చెప్పగలరు. నేరం నిరూపితమైతే రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధించే అవకాశం ఉంది. కానీ నేరం రుజువు కావాలంటే కేసు ఏళ్లకు ఏళ్లు నడవడం చూస్తునే ఉన్నాం. ఈ సమయంలో సుప్రీం సూచన మంచిదే.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
గాడి తప్పిన పాలన
తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా వర్శిటీ తరువాత అంతటి పేరున్నది కాకతీయ విశ్వవిద్యాలయానికే. యాభై ఏళ్లుగా ఉత్తర తెలంగాణలో దాదాపు 400 డిగ్రీ కళాశాలల ద్వారా విద్యారంగం అభివృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. అయితే గడచిన ఐదేళ్లుగా కెయు పాలన గాడితప్పింది. షెడ్యూల్ ప్రకారం ఏ ఒక్క పనీ సాగడం లేదు. పరీక్షల నిర్వహణ అగమ్యగోచరం. ఒకవేళ పరీక్షలు సజావుగా సాగినప్పటికీ ఫలితాల ప్రకటన ఎప్పుడూ ప్రహసనమే. తక్కువ ఉత్తీర్ణత సాధిస్తూ గత వైభవాన్ని కోల్పోతోంది. కాకతీయ విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ ఉప కులపతిని నియమిస్తేగాని మంచి జరగదు. వర్శిటీ వ్యవహారాలలో రాజకీయ జోక్యం పెరగడం, పిహెచ్‌డి ఫలితాలలో అక్రమాలు వర్శిటీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట