ఉత్తరాయణం

అమలుకాని ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని జారీ చేసిన ఆదేశాలు గుంటూరు జిల్లాలో అమలు కావడం లేదు. నిజానికి భద్రత కోసమే చెప్పినప్పటికీ వాహన చోదకులు బాధ్యత లేకుండా వ్యవహరించడం బాధాకరం. హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై కొద్దిపాటి మొత్తాలను జరిమానాగా విధించి వదిలేయడం వల్ల వారు భయపడటం లేదు. వాహన చోదకుల రక్షణ కోసం సూచించిన ప్రమాణాలను పాటించకపోవడం సరికాదు. కార్లవంటి వాహనాల్లో సీట్‌బెల్టు పెట్టుకోకపోవడం, వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌లలో మాట్లాడటం వంటివి యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
అందని రుణాలు
తెలంగాణలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ల ద్వారా ఇస్తామన్న రుణాలు కార్యరూపం దాల్చలేదు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండే సింగరేణిలో కార్మికులకు వడ్డీలేకుండా పది లక్షల రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన సీఎం దళితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇది బాధాకరం. సింగరేణి ఎన్నికల్లో లబ్దికోసం ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలి. నిరుద్యోగ ఎస్‌సి, ఎస్‌టి, బిసి యువకులను ఆదుకునేందుకు తక్షణం రుణాలు మంజూరు చేయాలి.
-కందకట్ల శ్రావణ్, శ్రీరాంపూర్ (మంచిర్యాల)
ఆధార్ అనుసంధానం ఆలస్యం
తెలంగాణలో విద్యాసంస్థలలో బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌ను అరికట్టేందుకు ఆధార్ అనుసంధానం చేయాలన్న ఆదేశాలు అమలులో సక్రమంగా సాగడం లేదు. నిజానికి అక్టోబర్ నెలాఖరుకు ఈ పని పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించినా కనీసం పది శాతం పనులు కూడా పూర్తి కాలేదు. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం తగిన వౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదు. విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
-సి.హెచ్.సాయిఋత్విక్, నల్గొండ