ఉత్తరాయణం

సిమెంటు రోడ్లు దండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారు రోడ్లకన్నా సిమెంటు రోడ్లు మన్నిక ఎక్కువని, ఒకసారి వేస్తే ఎక్కువ కాలం రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం సబబే. కానీ సిమెంటు రోడ్లు వేసిన తరువాత కొద్ది కాలానికే వివిధ కారణాలతో తవ్వేస్తున్నారు. నీటి గొట్టాలు, కేబులింగ్ కోసం అలా తవ్వేయడం వల్ల పెద్దఎత్తున ధనం వృధా అవుతోంది. తారు రోడ్లు మరమ్మతు చేసినంత సులువుగా వీటిని మరమ్మతు చేయలేరు. పైగా సిమెంట్ రోడ్ల వల్ల వాటి ఎత్తు పెరుగుతోంది. ఇళ్లు దిగువన ఉండిపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పుడు 5వేల జనాభా ఉన్న గ్రామాల్లోనూ పైపులైన్లు వేయబోతున్నారు. అలాంటప్పుడు సిమెంట్ రోడ్ల వల్ల ఉపయోగం తక్కువే. లేదా వాటిని ధ్వంసం చేయని రూట్లలో వేస్తే కొంత నయం.

-టి.సాంబశివరావు, నరసరావుపేట